English   

హాలీవుడ్ రీమేక్ రెడీ చేస్తున్న అమీర్ ఖాన్ !

Aamir Khan to play 'Forrest Gump' in Bollywood remake
2019-03-10 14:10:36

రీమేక్స్ కి హద్ద్దేముంది బాసూ, అది కూడా మన బాలీవుడ్ వాళ్ళు అందుకు సిద్దహస్తులు, ఏ బాషలో అయినా మంచి సినిమా కంటపడడం ఆలస్యం దానిని మన బాలీవుడ్ లోకి ఎలా తీసుకొద్దామా అనే ఆలోచన. తాజాగా ఒక సూపెర్ హిట్ బాలీవుడ్ సినిమా రీమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. అందుతున్న సమాకాహ్రం ప్రకారం పాతికేళ్ళ క్రితం హాలీవుడ్ లో విడుదలయి అనేక రికార్డులు కొల్లగొట్టిన ఫారెస్ట్ గంప్ ఇప్పుడు బాలీవుడ్ లోకి రీమేక్ చేస్తున్నారట. 'ఫారెస్ట్ గంప్' హాలీవుడ్ క్లాసిక్స్ లలో ఒకటిగా నిలిచిపోయింది. టామ్ హాంక్స్ ప్రధాన పాత్రధారిగా రూపొందిన ఈ సినిమా  1986లో వచ్చిన అదే పేరుతో గల నవల ఆధారంగా తెరకెక్కింది.   ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడమే కాకుండా, 6 ఆస్కార్ పురస్కారాలను సొంతం చేసుకుంది. అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా రీమేక్ ని అమీర్ టేకప్ చేసాడని అందుకు సంబందించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ కూడా త్వరలో చేయనున్నాడని అంటున్నారు. గత సినిమా తగ్స్ ఆఫ్ హిందూస్తాన్ ఫ్లాప్ కావడంతో బాధలో ఉన్న అమీర్ ఫాన్స్ కి కాస్త ఊరట నిచ్చే అంశమే. అక్కడ హాలీవుడ్లో రాబిన్ రైట్ కధానాయికగా నటించగా మరి అమీర్ సరసన ఎవరు నటిస్తున్నారో వేచి చూడాలి.

More Related Stories