English   

మళ్ళీ కరణ్ తో పాండ్య...వార్తల్లోకి !

Karan Johar and Hardik Pandya dance together at Akash Ambani’s wedding
2019-03-10 14:29:13

ఈ ఏడాది ఆరంభంలో ‘కాఫీ విత్ కరణ్’ టాక్ షోలో అమ్మాయిలపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా హార్దిక్ పాండ్య కొన్నిరోజులు నిషేధం కూడా ఎదుర్కొన్న విషయం తెలిసిందే. కేఏల్ రాహుల్ తో కలిసి షోలో పాల్గొన్న పాండ్యా నోరు జారి చేసిన వ్యాఖ్యలు అనేక తంటాలు తెచ్చిపెట్టాయి. బీసీసీఐ పాలకుల కమిటీ ఆ నిషేధాన్ని తాత్కాలికంగా ఎత్తివేయగా.. ఆ తర్వాత భారత్ జట్టులోకి పునరాగమనం చేసిన హార్దిక్ పాండ్య మళ్లీ వెన్నునొప్పి కారణంగా ఆస్ట్రేలియా‌తో సిరీస్‌ లో టీమ్‌కి దూరమయ్యాడు. ఐపీఎల్ 2019 సీజన్‌కి ఫిట్‌నెస్ సాధించాలని ప్రస్తుతం ట్రై చేస్తున్న హార్దిక్ పాండ్య.. తాజాగా ముంబయిలో జరిగిన ఆకాశ్ అంబానీ - శ్లోకా మెహతా వివాహానికి హాజరై సందడి చేశాడు. తన సోదరుడు కృనాల్ పాండ్యాతో కలిసి హార్దిక్ వేడుకకి వచ్చాడు. ఈ నేపధ్యంలో మళ్ళీ కరణ్ జోహార్‌తో కలిసి డ్యాన్స్ చేసి వార్తల్లో నిలిచాడు. ఆ వేదికపై కాసేపు కరణ్ జోహార్‌తో కలిసి డ్యాన్స్ చేశాడు. ఆకాశ్ అంబానీ కుటుంబానికి చెందిన ముంబయి ఇండియన్స్ టీమ్‌కి పాండ్యా బ్రదర్స్ గత మూడేళ్ల నుంచి ఆడుతున్న విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలోనే వారు వేడుకకి హాజరయ్యారు.

More Related Stories