English   

విక్రమార్కుడు సీక్వెల్ నిజమేనా ?

Vikramarkudu Sequel on cards
2019-03-10 22:00:42

సూపర్ హిట్ సినిమాలకి సీక్వెల్స్ తీయడం ఇప్పుడు కొత్త ట్రెండ్ గా మారింది. 2006 లో రిలీజ్ అయి సంచలన విజయం సాధించిన విక్రమార్కుడు సినిమాకి రవితేజ హీరోగా నటించగా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమాకి రాజమౌళి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. అది కూడా రవితేజతో కాదట మహేష్ బాబుతోనట. అయితే ఇది వాస్తవం అయినా కాక పోయినా మహేష్ బాబు తో రాజమౌళి సినిమా చేయాలి అది ఎప్పుడు కుదురుతుందో కానీ చేయడం మాత్రం పక్కా. నిజానికి విక్రమార్కుడు వచ్చి 13 ఏళ్ళు దాటింది. దానికి ఇప్పుడు కొనసాగింపు అనేది సరైన ఆలోచనేనా అనేది రాజమౌళి ఆలోచించాలి. ఎందుకంటే ఎంతో పవర్ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో నటించిన రవితేజ దానికి కొనసాగింపుగా ఎన్నో పోలీస్ ఆఫీసర్ పాత్రలు చేసి బోర్ కొట్టించేశాడు. ఇక మహేశ్ కూడా దూకుడు ఇచ్చిన బూస్ట్ తో ఆగడు చేసి దెబ్బతిన్నాడు. దీన్ని బట్టి విక్రమార్కుడు సీక్వెల్ అనేది గాసిప్ అనే అనుకోవాలి మరి.

More Related Stories