English   

ఎట్టకేలకి తేలిన ఫలితం...మా పీఠం నరేష్ దే !

Naresh-Panel
2019-03-11 08:55:10

మా అసోసియేషన్ ఎన్నికల్లో అద్భుతాలేమీ జరగలేదు, ముందు నుంచి ఊహించినట్లే నరేష్ వర్గం గెలిచింది అధ్యక్షుడిగా నరేష్ ఎన్నికయ్యాడు. గత ఎన్నికల్లో గెలిచిన శివాజీరాజా పై ఈసారి నరేష్ అధ్యక్షుడిగా పోటీ చేసి గెలిచారు. ఆయన వర్గం నుంచి జీవిత రాజశేఖర్ రాజశేఖర్ గౌతంరాజు లాంటివాళ్ళు ఈసారి గెలిచారు. శివాజీ వర్గం నుంచి చాలా తక్కువ మంది ఈసారి ఎన్నికల్లో గెలిచారు. దాంతో మా అసోసియేషన్ అధ్యక్షుడిగా ఈసారి నరేష్ ఎంపిక కాబోతున్నాడు. మార్చి 10 సాయంత్రము ఎప్పుడో పూర్తయినా ఎన్నికలు ఓటింగ్ విషయంలో మాత్రం చాలా ఆలస్యమైంది. సాయంత్రం 4 గంటలకు ఓటింగ్ ప్రక్రియ మొదలైతే రాత్రంతా అది కొనసాగింది తెల్లవారుజామున ఎవరు గెలిచారు అనేది ప్రకటించారు. మా అసోసియేషన్ మెంబర్ నటి హేమ ఇండిపెండెంట్గా పోటీచేసి ఉపాధ్యక్షురాలిగా గెలవడం ఇక్కడ విశేషం. గత ఎన్నికల్లో ఆమె శివాజీ రాజ ప్యానెల్ నుంచి గెలిచి ఈసీ మెంబర్ గా బాధ్యతలు స్వీకరించింది. కానీ తనకు సరైన గుర్తింపు ఇవ్వలేదని ఈసారి సొంతంగా పోటీచేసి గెలిచింది హేమ. ఇక నరేష్ వర్గం ఈసారి గెలుపొందడం లో కీలక పాత్ర పోషించినది మెగా కుటుంబమే,  ఎన్నికలకు సరిగ్గా ఒక్కరోజు ముందు నాగబాబు బయటకు వచ్చి తాను నరేష్ కు సపోర్ట్ చేస్తున్నట్లు చెప్పాడు. అప్పట్లో శ్రీ రెడ్డి మా అసోసియేషన్ దగ్గరికి వచ్చి చేసిన రచ్చ ఎవరూ మరిచిపోలేరు దానికి తోడు పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేసింది, ఆమె అంతగా విమర్శలు చేసినా కూడా శివాజీరాజా తో పాటు ఎవరు ఈ విషయంలో పెద్దగా పట్టించుకోలేదు దాంతో మెగా ఫ్యామిలీ అంతా హర్ట్ అయిపోయింది,. ఈసారి అంతా కలిసి నరేష్ వర్గానికి సపోర్ట్ చేశారు దాని ఫలితమే ఇప్పుడు వచ్చిన ఎన్నికలు వాటి ఫలితాలు ఏదేమైనా మన అసోసియేషన్ లో మెగా ఫ్యామిలీ అనుకున్నది తుది నిర్ణయమని మరోసారి బయటపడింది.

More Related Stories