English   

శివాజీ రాజాని వారే ఓడించారా ?

Shivaji-Raja
2019-03-11 09:04:48

శివాజీ రాజా ను కావాలని అందరూ ఒంటరి చేశారా ? ఆయనను పనిగట్టుకుని మరీ ఓడించారా ? అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో పరిస్థితులు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. నిజానికి శివాజీ రాజా మ అసోసియేషన్ అధ్యక్షుడిగా అద్భుతంగా పని చేసాడనే ప్రశంసలు అందరి దగ్గరా అందుకున్నాడు. ఆయన అధ్యక్షుడు గా ఉన్నప్పుడే మా అసోసియేషన్ ముందుకు వెళుతుందని చిరంజీవి లాంటి వాళ్లు కూడా ప్రశంసించారు. ఆయన రెండోసారి అధ్యక్షుడిగా మారి అన్ని అర్హతలు ఉన్న కూడా కేవలం పవన్ కళ్యాణ్ ఇష్యు తోనే ఈరోజు మా అధ్యక్షపదవికి శివాజీరాజా అయిపోయాడని అనుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ విషయాన్ని పర్సనల్ గా తీసుకున్న మెగా కుటుంబం వాళ్లతో పాటు ఇంకా చాలామంది శివాజీరాజా అధ్యక్ష పదవి నుంచి దూరం చేశారని అంటున్నారు. ఆయన వర్గం నుంచి కొందరు గెలిచాక కూడా శివాజీరాజా మాత్రం నిలవలేకపోయాడు. శ్రీకాంత్ లాంటి వాళ్ళు కూడా ఓడిపోవడం ఈసారి మా ఎన్నికలు ఎలా జరిగాయో చెప్పకనే చెబుతోంది. అన్నింటికీ మించి నరేష్ వర్గం ఎన్నికలకు ముందే తాము గెలిచే తీరతాము అన్నట్లుగా సంబరాలు చేసుకోవడం ఇండస్ట్రీలో పరిస్థితికి అద్దం పడుతుంది. నిజానికి నరేష్ వర్గానికి గెలుస్తామన్న నమ్మకం ఏ కోశానా లేదనే వార్తలు వినిపించాయి. ఎన్నికలకు మూడు రోజుల ముందు వరకు కూడా శివాజీరాజా గెలుస్తాడు అనే వార్తలు వినిపించాయి. కానీ చివరి నిమిషంలో మెగా ఫ్యామిలీ సీన్ లోకి వచ్చింది దాంతో సీన్ మారిపోయింది.  ఏదేమైనా ఇప్పుడు మా కొత్త అధ్యక్షుడిగా నరేష్ ఎంపికయ్యాడు మరి ఆయన ఎలాంటి పనులు చేసి చూపిస్తాడో చూడాలి ?

More Related Stories