English   

జగన్ గూటికి అలీ...సీటు లేకున్నా !

Actor-Ali
2019-03-11 11:22:05

ఎట్టకేలకి ఉత్కంటకి తెరదించుతూ సినీ హాస్యనటుడు అలీ వైసీపీ గూటికి చేరారు. ఈరోజు ఉదయం హైదరాబాద్‌లోని లోటస్ పాండ్‌లో జగన్‌తో భేటీ అయిన అలీ వైసీపీ కండువా కప్పుకున్నారు. టీడీపీ నుంచి గుంటూరు ఈస్ట్ నుంచి పోటీ చేయాలని అలీ ఆశించారు. అయితే దీనికి సంబంధించి చంద్రబాబు స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతోనే అలీ వైసీపీలో చేరారని అంటున్నారు. అయితే ఇక్కడ కూడా టికెట్ హామీ ఇవ్వలేదని ఆయనే చెబుతున్నారు. అయితే ఇప్పటికే ఆయన వైఎస్ జగన్, సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్‌తో వరుసగా భేటీ అయ్యారు. నిన్న మొన్నటి వరకూ కూడా ఆయన టీడీపీ తీర్థం పుచ్చుకుంటారని గుంటూరు పశ్చిమ లేదా రాజమండ్రి నుంచి అసెంబ్లీ నుంచి పోటీ చేస్తారని వార్తలు వచ్చాయి. అయితే అందరికీ షాకిచ్చిన అలీ సడన్‌‌గా వైసీపీ గూటికి చేరుతుండటం అనేక ప్రశ్నలకి తావిస్తోంది. ఈ ప్రశ్నలకి సమాధానంగా అలీ జగన్ వస్తే అభివృద్ధి బాగుంటుందని ప్రజలు నమ్ముతున్నారని నేను ఆయన్ని గతంలో కలిసి మాట్లాడానని ఆయన నన్ను రమ్మని ఆహ్వానించారనీ కానీ తానే కొంత సమయం కావాలని కోరానని అన్నారు. 1999లో ఓ పార్టీ కండువా కప్పుకున్నానని మళ్లీ 2019 ఈ పార్టీ కండువా కప్పుకున్నానని ఖచ్చితంగా మంచి మెజారిటీతో జగన్‌ని సీఎం చేయడమే తన ధ్యేయమని అలీ అన్నారు. అయితే టికెట్ గురించి ప్రశ్నించగా పాదయాత్ర చేస్తున్న సమయంలో జగన్ చాలా మందికి హామీ ఇచ్చిన కారణంగా తనకు టికెట్ ఇవ్వలేనని చెప్పారని అందుకే తాను ఈ ఎన్నికల్లో పోటీ చేయకుండా కేవలం పార్టీ తరఫున ప్రచారం చేస్తానని అలీ చెప్పారు. అలాగే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నన్ను సోషియల్ మీడియా లో టార్గెట్ చేస్తే వాళ్లకు ఎలా సమాధానం చెప్పాలో నాకు తెలుసని అలీ అన్నారు. తానెవరికి టార్గెట్  కాదని..  తనకు ఎవరు టార్గెట్ కాదని, తనను టార్గెట్ చేసేవాళ్లు పిచ్చోళ్లని అలీ అన్నారు. మంత్రి కావాలన్నది నా కల,పదవి ఇస్తానన్న పార్టీ లో చేరుతానన్న మాట మీదే నిలబడి వున్నానని ఆయన అన్నారు. 

More Related Stories