English   

మహేష్ బాబు సినిమాతో విజయశాంతి రీ ఎంట్రీ !

Vijayshanthi
2019-03-11 04:46:15

ఎన్నికల నోటిఫికేషన్ వెలువడడంతో రాజకీయ నాయకులంతా ఎన్నికల హడావుడిలో మునిగిపోయారు. పొలిటీషియన్లంతా రాజకీయాలతో బిజీ అవుతుంటే, విజయశాంతి ఒకపక్క ఎంపీ సీటుకు ట్రై చేస్తునే సినిమాల్లో రీఎంట్రీ గురించి కూడా ఆలోచిస్తున్నారట. అన్నీ కుదిరితే విజయశాంతి ఈ ఏడాదే మళ్ళీ స్క్రీన్ మీద సందడి చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈసారి ఆమె రీఎంట్రీ ఇచ్చేది కూడా మహేష్ బాబు సినిమాలో అట. ఈ ఏడాది మే నెలలో మహేష్ బాబు మహర్షి మూవీ రిలీజ్ అవుతుండగా జులై నుంచి అనీల్ రావిపూడి దర్శకత్వంలో ఓ ఫుల్ లెంగ్త్ ఎంటర్ టైనర్ చేయబోతున్నాడు. అనీల్ రావిపూడి స్టయిల్ లోనే పక్కా కమర్షియల్ గా కామెడీ టచ్ ఉన్న మెసేజ్ ఓరియంటెడ్ మూవీ గా రాబోతోంది. ఇందులో ఓ కీలక పాత్ర కోసం విజయశాంతిని సంప్రదించినట్టు వార్తలు వస్తున్నాయి. సినిమాల్లో హైలైట్  రీఎంట్రీ కోసం చూస్తున్న విజయశాంతి కూడా, మహేష్ బాబు సినిమాకు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. గతంలో కొడుకు దిద్దిన కాపురం లో విజయశాంతి మహేష్ బాబు కలిసి నటించారు . కృష్ణ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన ఆ చిత్రంలో విజయశాంతి హీరోయిన్ కాగా మహేష్ బాబు ఆమె కొడుకుగా నటించారు. 1989 లో రిలీజ్ అయిన ఆ సినిమా ఘనవిజయం సాధించింది. ఈసారి మాత్రం ఏ పాత్ర పోషిస్తున్నారో మరి !
 

More Related Stories