English   

పూనమ్ ఆడియో లీక్స్...రాజకీయాలు చేసి జనాన్ని ఉద్దరిస్తాడు అంట !

Sri-reddy
2019-03-11 12:37:50

పవన్ కళ్యాణ్ అంటేనే తోక తొక్కినా తాచులా లేచే శ్రీ రెడ్డి మరోసారి ఆయన్ని టార్గెట్ చేసింది. తన విమర్శలకు పదును పెడుతూ కొత్తగా పూనమ్ కౌర్‌ని తెరపైకి తీసుకువచ్చింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో పూనమ్ కౌర్ ఫోన్ కాల్ అంటూ ఒక రెండు ఆడియో క్లిప్స్ వైరల్ అవుతుంది. ఇందులో పవన్ కళ్యాణ్ గురించి ప్రస్తావిస్తూ భావోద్వేగంతో మాట్లాడారు పూనమ్ కౌర్ గా చెప్పబడుతున్న వాయిస్ ఉన్న మహిళ. అయితే అసలు ఆ ఆడియో టేప్‌లో మాట్లాడింది పూనమ్ కౌర్‌ ఏనా ? లేదా వేరే ఎవరైనా కావాలనే అలా పూనమ్ లాగా మాట్లాడిన్చారా అనేది క్లారిటీ లేదు, అందుకే రెండ్రోజుల నుండీ అవి వైరల్ అవుతున్నా మీడియా పెద్దగా పట్టించుకోలేదు. అయితే పవన్ ని కార్నర్ చేయడానికి రెడీగా ఉండే శ్రీ రెడ్డి మాత్రం లీకైన ఆడియో వాయిస్ పూనమ్ కౌర్‌దేనని పూనమ్ కౌర్ మాటలు వింటే ఏడుపు వచ్చిందని పేర్కొంది. ఎట్టి పరిస్థితుల్లోనూ పవన్ కళ్యాణ్‌ని వదలనని అన్ని విషయాల్లోనూ పవన్ విఫలం అయ్యారంటూ స్పందించింది శ్రీరెడ్డి. అయితే మీడియాలో చక్కర్లు కొడుతున్న పూనమ్ కౌర్ ఆడియో టేపులపై జనసైనికులు కవర్ చేస్తూ తెలుగు మాట్లాడటమే రాని పూనమ్ కౌర్ ఇంత బాగా తెలుగు ఎలా మాట్లాడుతుందని ఇది పవన్ కళ్యాణ్‌ కుట్ర అని కవర్ చేసుకునే పనిలో పడ్డారు. అయితే పూనమ్‌కి తెలుగు రాదంటున్న పవన్ ఫ్యాన్స్ కావాలంటే వాయిస్ కంపేర్ చేసుకోండి అంటూ ఆమె గత ఇంటర్వ్యూ వీడియోను పోస్ట్ చేసింది శ్రీరెడ్డి.  పవన్ కళ్యాణ్ నన్ను పెళ్లి చేసుకుని నాకు తెలియకుండా ఇంకొక అమ్మాయి ని ప్రెగ్నెంట్ చేస్తే ఎలా తట్టుకుంటాం - వీడియో ఇంటర్వ్యూ లో రేణు దేశాయి అందని, పవన్ కళ్యాణ్ నాకు ఐ లవ్యూ చెప్పి ఇంకొక అమ్మాయిని ప్రేగ్నెంట్ చేస్తే నాకు బాధ ఉండదా - ఆడియో లో పూనమ్ కౌర్ అందని ఇంత నీచమైన ఆలోచన ఉన్న వ్యక్తి రాజకీయాలు చేసి జనాన్ని  ఉద్దరిస్తాడు అంట, రాజకీయాలకు కావలసింది క్యారెక్టర్. పవన్ కళ్యాణ్ రాజకీయాలోనే కాదు సమాజం లో ఉండటానికి కూడా అనర్హుడని శ్రీ రెడ్డి వ్యాఖ్యానించింది.

More Related Stories