English   

పోలీసాఫీసర్ గా రజనీ ?

Rajinikanth
2019-03-11 06:53:27

'పేట' సినిమాతో సంక్రాంతికి సందడి చేసిన రజనీకాంత్, ఇప్పుడు మురుగదాస్ తో సినిమా చేయడానికి రంగంలోకి దిగుతున్నారు. ఈ నెలాఖరులో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. పక్కా యాక్షన్ ఓరియంటెడ్ సబ్జెక్టుగా మురుగదాస్ సినిమా ఉండబోతుందట, అలాగే కథా పరంగా ఈ సినిమా ముంబై నేపథ్యంలో సాగుతుందట. ఈ సినిమాలో రజనీకాంత్ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడనీ, ప్రభుత్వ వ్యవస్థలోని లొసుగులను ఆధారంగా చేసుకుని మోసాలకు పాల్పడే కొందరిపై పోరాటం చేసేవాడిగా ఆయన కనిపిస్తాడని అంటున్నారు. మూడు దశాబ్దాల కింద వచ్చిన ఒక సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా నటించిన రజినీ  మళ్ళీ ఇన్నేళ్ళ తర్వాత ఖాకీ డ్రెస్ వేసుకోబోతున్నాడు. అది కూడా 70 ఏళ్ళ వయసులో ఒక పోలీస్ ఆఫీసర్ గా నటించడం అంటే మామూలు విషయం కాదు అనుకోండి. అదీ కాక ఈ క్యారెక్టర్ ను మురుగుదాస్ ప్రత్యేకంగా డిజైన్ చేశారని తెలుస్తోంది. భారీ అంచనాలతో వచ్చిన పేట సినిమా యావరేజ్ గా ఆడడంతో ఇప్పుడు ఆయన అభిమానుల ఆశలన్నీ మురుగుదాస్ సినిమా పైనే ఉన్నాయి. ఈ సినిమా దసరాకు విడుదల కానుందని అంటున్నారు. చూడాలి మరి ఏమి చేస్తారో ?

More Related Stories