English   

ఆ సినిమాకి బలం అనుకుంటే బలహీనత అయ్యిందట !

Priya-Prakash-Varrier
2019-03-11 16:12:52

ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అంటారు కదా, మళయాళ కుట్టి ప్రియా వారియర్ విషయంలో కూడా ఇదే జరిగింది. పాపం ఆ అమ్మాయి తొలి సినిమా విడుదల కాకముందే ఇండియా మొత్తం ఫేమస్ అయిపోయింది ప్రియా వారియర్. ఒక్కసారి కన్నుకొట్టి ఇండియా మొత్తాన్ని ప్రియ వారియర్ అసలు ఎలా నడుస్తుంది ? ఎలా ఉంటుంది ఇలాంటి విషయాలు పట్టించుకోకుండా దేశం మొత్తం ప్రియా జపం చేశారు. దాంతో ఆమె తొలి సినిమా విడుదలకు ముందే సూపర్ స్టార్ అయిపోయింది. తీరా మొదటి సినిమా లవర్స్ డే విడుదలైన తర్వాత అసలు ఎప్పుడు వచ్చింది ఎప్పుడు వెళ్లిపోయిందా కూడా తెలియదు. అంత దారుణంగా సినిమా బోల్తా కొట్టింది. అసలు ఇది సినిమా ఇండస్ట్రీ ఇక్కడ హిట్ కొట్టక పోతే ఎవడు పట్టించుకోడు అది ప్రియ వారియర్ అయినా ఇంకా ఎవరైనా. విజయం సాధించాల్సిందే మరో ఆప్షన్ లేదు కాకపోతే ఈ భామకు తొలి సినిమానే మరీ దారుణంగా డిజాస్టర్ కావడంతో ఇన్నాళ్లు నెత్తిన పెట్టుకొని పూజించిన వారే ఇప్పుడు నేలకేసి కొడుతున్నారు. ముఖ్యంగా లవర్స్ డే దర్శకుడు ఒమర్ లులు మీడియా ముందుకు వచ్చి ప్రియా వారియర్ పై సంచలన ఆరోపణలు చేశాడు. ఒమర్ ముందుగా తాను రాసుకున్న కథ వేరు అని ప్రియా వారియర్ కు వచ్చిన ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని నిర్మాతలు తనతో బలవంతంగా కథను మార్చి చేయించారని అందుకే సినిమా ఫ్లాప్ అయింది అంటున్నాడు.  ఈ దర్శకుడు తాను రాసుకున్న కథ వేరు చివరగా వచ్చిన ప్రాజెక్టు వేరు అంటున్నాడు. ఈయన సరిగ్గా పది రోజుల కింద హీరో సినిమాలో ప్రియ ప్రకాష్ వారియర్ తో పాటు నటించిన నూరీన్ షరీఫ్ కూడా సంచలన వ్యాఖ్యలు చేసింది. తన కెరీర్ పూర్తిగా ప్రియా ప్రకాష్ వారియర్ వల్ల నాశనం అయింది అంటూ ఆమె కామెంట్ చేసింది. ఇప్పుడు దర్శకుడు కూడా ఇలాంటి కామెంట్ చేయడంతో సంచలనంగా మారింది.

More Related Stories