English   

వెంకటేష్ సినిమాలో హీరోయిన్ గా సైఫ్ అలీ ఖాన్ కూతురు !

Sara-Ali-Khan
2019-03-11 09:30:04

సైఫ్ అలీ ఖాన్ కూతురు, నటి సారా అలీ ఖాన్ వెంకటేష్ సినిమాలో నటిస్తోందా అనే అవుననే సమాధానం వినిపిస్తోంది. అదేంటి ఆమె వెంకటేష్ సినిమాలో నటించడం ఏమిటి ? అంటే ఆమెను తెలుగు ఇండస్ట్రీకి తెస్తున్నారా ? అనే అనుమానాలు ఇప్పటికే మొదలయ్యి ఉంటాయి కదా. అయితే ఈమె వెంకటేష్ సినిమాలో నటిస్తుందనేది నిజం కానీ ఆమె తెలుగు ఇండస్ట్రీకి వస్తుంది అనేది మాత్రం అబద్దం. ఎలా అంటే ఆమె కేదార్ నాథ్ సినిమాతో బాలీవుడ్ కు పరిచయమయి రన్వీర్ సింగ్ తో నటించిన రెండో సినిమా సింబాతో ఘన విజయం అందుకుంది. అయితే ఆమె ప్రస్తుతం వరుణ్ ధావన్ హీరోగా నటిస్తున్న కూలి నెంబర్ వన్ సినిమా రీమేక్ లో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రం 1991లో మన వెంకటేష్ హీరోగా నటించిన కూలి నెంబర్ వన్ సినిమాకు రీమేక్. అప్పట్లో వరుణ్ ధావన్ తండ్రి డేవిడ్ ధావన్ ఈ సినిమాను గోవిందా హీరోగా రీమేక్ చేశాడు. ఇన్నేళ్లకు మళ్లీ వరుణ్ ధావన్ తో ఈ సినిమాను మళ్ళీ రీమేక్ చేస్తున్నాడు డేవిడ్ ధావన్. ఇప్పటికే తెలుగు కందిరీగ సినిమాను మై తేరా హీరో పేరుతో బాలీవుడ్ లో రీమేక్ చేశాడు ఈయన. ఇక ఇప్పుడు కూలీ నెంబర్ వన్ సినిమాను మరోసారి తనయుడు హీరోగా రీమేక్ చేస్తున్నాడు. ఈ సినిమాలో సారా అలీ ఖాన్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం షూట్ జరుపుకుంటున్న ఈ సినిమా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

More Related Stories