English   

ఆకాష్ పూరీ కోసం నయా భామ !

Ketika-Sharma
2019-03-11 17:29:34

డ్యాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ త‌న‌యుడు ఆకాష్ కొత్త సినిమా రొమాంటిక్ టైటిల్ తో ఇటీవ‌లే సెట్స్ మీదకు వెళ్లిన సంగ‌తి తెలిసిందే. పూరి శిష్యుడు అనిల్ పాదూరి దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. పూరి క‌థ‌, స్కీన్ ప్లే, డైలాగులు అందించి కేవలం దర్శకత్వ బాద్యతలు మాత్రం శిష్యుడికి బాధ్య‌త‌లు అప్ప‌గించి ఆయన దానిని ప‌ర్యవేక్ష‌ణ చేస్తున్నాడు. సికింద్రాబాద్ లోని ఒక స్లంలో ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శ‌ర వేగంగా జ‌రుగుతోంది. అయితే ఆకాష్ కు జోడీగా ఏ భామ‌ను ఎంపిక చేసార‌న్న‌ది మాత్రం ఇంకా బ‌య‌ట‌కు రాలేదు. పూరి లెక్క‌లు ప్ర‌కారం కొత్త భామేనే తీసుకునే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయని వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ విషయాన్ని దృవీకరించారు పూరీ కనెక్ట్స్ టీం. ఈ సినిమాలో ఆకాష్ పూరీ తరపున కొత్త హీరోయిన్ కెతికా శర్మ నటిస్తున్నట్టు ప్రకటించింది సినిమా యూనిట్. ఢిల్లీకి చెందిన ఈ భామ మోడలింగ్ కూడా చేసిందట, ఒక డబ్స్మాష్ చేసి పాపులర్ అయిన ఈ ఢిల్లీ భామని హీరోయిన్ గా ఫిక్స్ చేసారన్నమాట. అలాగే ఈ సినిమాలో ఆకాష్ త‌ల్లి పాత్ర ఒక‌టి కీల‌కంగా ఉండ‌బోతుందట‌. ఆ పాత్ర‌కు ఛార్మి నటిస్తున్నారని సమాచారం. నిజం ఎంత‌న్న‌ది తేలాల్సి ఉంది.

More Related Stories