English   

సన్నీని ఏడిపించిన నెటిజన్ !

Sunny-Leone
2019-03-11 11:04:13

పోర్న్ స్టార్ గా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన సన్నీలియోన్ వాటికి గుడ్ బై చెప్పి బాలీవుడ్ సినిమాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంతోంది. ఆమె ఇప్పటికే బాలీవుడ్ సహా ఇతర భాషల చిత్రాల్లోనూ నటించింది. అయినా సన్నీలియోన్ గత జీవితపు గుర్తులు మాత్రం ఆమెను వదలడం లేదు. ఏదో రకంగా సన్నీకి గత జీవితానికి సంబంధించిన గుర్తులు ఎదురవుతునే ఉన్నాయట. తాజాగా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్ వ్యాఖతగా వ్యవహరిస్తున్న ‘పించ్’ అనే లైవ్ టాక్ షోకు సన్నీ వెళ్లింది. సోషల్ మీడియాలో సెలబ్రిటీలపై నెటిజన్ల కామెంట్లు, వారి ప్రశ్నలపై చర్చించడమే ఈ షో ముఖ్య ఉద్దేశం. ఈ సందర్భంగా ఓ నెటిజన్ చేసిన అసభ్యకర కామెంట్ గురించి అర్భాజ్ ప్రస్తావించారు. దాంతో సన్నీ బోరున ఏడ్చేసిందట. ఈ సందర్భంలో అర్భాజ్ ఓదార్చుతున్నా ఆమె వెక్కి వెక్కి ఏడ్చిందట. పాత జీవితాన్ని మర్చిపోయి కొత్త జీవితాన్ని గడుపుతున్న తనను మళ్లీ పాత విషయాలనే గుర్తు చేస్తూ మానసిక వేదనకు గురి చేస్తున్నారని సన్నీ ఆవేదన వ్యక్తం చేసిందట. నిజానికి చాలా మంది తాము సోషల్ మీడియాలో ఏమేం చేస్తున్నా అది ఎవరికీ తెలియదని ఎందుకంటే ఫేక్ అకౌంట్స్ తో చేస్తున్నాం కదా అనుకుంటున్నారు. ఇంటర్నెట్‌లో ఎవరు ఏం చేసినా అది రికార్డెడ్‌గా ఉంటుంది. ఎవరైనా ఏ తప్పు చేసినా దాన్ని బాధితులు ఫిర్యాదు చేస్తే పోలీసులు, సైబర్ నిపుణులు తేలిగ్గా ట్రాక్ చేయగలుగుతారు. ఫోన్ లేదా కంప్యూటర్ ఏది వాడినా అందులో ఇంటర్నెట్ ఓపెన్ చేస్తే దానికి ఉండే ఐపీ అడ్రస్‌ను వారు ట్రాక్ చేస్తారు. కొందరు పట్టిక్చుకోక పోవచ్చు కానీ పట్టించుకుంటే మాత్రం ఇబ్బందులు తప్పవు.

More Related Stories