English   

వేర్ ఈజ్ వెంకటలక్ష్మి సెన్సార్ టాక్ !

Lakshmi Rai's Where Is The Venkatalakshmi Censor Talk
2019-03-12 00:01:09

లక్ష్మి రాయ్ ప్రధాన పాత్రలో కిషోర్ కుమార్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కించిన చిత్రం వేర్ ఇస్ వెంకటలక్ష్మి. హారర్ కామెడీ థ్రిల్లర్ గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. బిజినెస్ ని మంచి ఫాం లో పెట్టడానికి లక్ష్మీరాయ్ పూజిత పొన్నాడ అందాలను ఆయుధంగా వాడుకుంటున్నారు దర్శక నిర్మాతలు. ఇప్పటికే పూజిత హాట్ సాంగ్ విడుదల చేశారు. ఈ పాటకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది, దానికి తోడు లక్ష్మీరాయ్ కూడా అదిరిపోయే అందాల ఆరబోతతో వేర్ ఇస్ వెంకటలక్ష్మి పై అంచనాలు పెంచేసింది. మార్చి 15న ఈచిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.  తాజాగా సెన్సార్ పూర్తి చేసుకున్న వేర్ ఈజ్ వెంకటలక్ష్మీ యు బై ఎ సర్టిఫికెట్ అందుకుంది. పెద్దగా కట్స్ లేకుండానే ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చారు బోర్డ్ మెంబర్స్. సినిమా కూడా ఆకట్టుకునేలా ఉందని హారర్ తో పాటు కామెడీ కూడా ఉండడంతో ప్రేక్షకులకు నచ్చే అంశాలు చాలా ఉన్నాయని చెబుతున్నారు సెన్సార్ సభ్యులు. ఈ సినిమాతో చాలా రోజుల తర్వాత తెలుగు ప్రేక్షకులను అలరించడానికి వస్తుంది లక్ష్మీ రాయ్. ఖైదీ నెంబర్ 150 రత్తాలు రత్తాలు పాట తర్వాత ఇక్కడ పెద్దగా సినిమాలు చేయలేదు లక్ష్మి రాయ్. మరి ఈ సినిమాతో ఈమె ఎలాంటి మాయ చేస్తుందో చూడాలి.

More Related Stories