English   

జెర్సీ డేట్ లాకయ్యింది...క్లైమాక్స్ తేడా కొడుతుందా ?

Nani's Jersey Movie release date locked
2019-03-12 07:37:27

నాని, శ్రద్ధ శ్రీనాథ్ హీరో హీరోయిన్లుగా 'మళ్ళీ రావా' ఫేం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో  సితార ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై   సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్న 'జెర్సీ' చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ మధ్యే విడుదలైన రెండు పాటలకు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. ఇది 36 సంవత్సరాల వయసులో తన కలను నెరవేర్చుకోవడానికి ప్రయత్నించే అర్జున్ అనే క్రికెటర్ కథ ఇది. జెర్సీ అని ఈ సినిమాకి టైటిల్ ఎందుకు పెట్టామో ఈ చిత్రం చూసిన తరువాత అందరికీ అర్థం అవుతుంది అంటున్నాడు సినిమా నిర్మాత. అర్జున్ క్యారెక్టర్ లో నాని ఒదిగిపోయాడని ఈ పాత్ర కోసం చాలా కష్టపడ్డారని చెప్పారు దర్శకనిర్మాతలు. ముఖ్యంగా క్రికెటర్ గా నటించడం అంత చిన్న విషయం కాదు దాని కోసం చాలా ప్రాక్టీస్ చేయాలి, నాని ఈ విషయంలో వంద శాతం న్యాయం చేశాడు. ప్రొఫెషనల్ క్రికెటర్గా జెర్సీ సినిమా కోసం మారిపోయాడు నాచురల్ స్టార్. ఇప్పటికే షూటింగ్ పూర్తి కావడంతో పాటు తాజాగా రిలీజ్ అయిన టీజర్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. అన్నింటికి మించి ఈ చిత్రం ఇండియన్ మాజీ క్రికెటర్ రమన్ లంబ జీవితం ఆధారంగా తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. అప్పట్లో ఇండియన్ క్రికెట్ కు చాలా తక్కువ రోజులు మాత్రమే సేవలు అందించాడు లంబ. 37 ఏళ్ల వయసులో బంగ్లాదేశ్ తో మ్యాచ్ ఆడుతూ బంతి తగిలి గ్రౌండ్లోనే ప్రాణాలు కోల్పోయాడు రమన్ లంబ. ఆయన జీవితం ఆధారంగా ఇప్పుడు జెర్సీ సినిమా వస్తుందని తెలుస్తోంది ఇందులో కూడా నెగిటివ్ క్లైమాక్స్ ఉంటుందని క్లైమాక్స్ లో నాని చనిపోతాడనే వార్తలు వినిపిస్తున్నాయి. ఏప్రిల్ 19న సినిమా విడుదల కానుంది మరి ఈ సినిమాతో నాని మళ్ళి హిట్ట్ కొట్టి ఫామ్ లోకి వస్తారా లేదా అనేది చూడాలి.

More Related Stories