English   

ఎక్కువ చేస్తే నేను నోరువిప్పుతానంటున్న ప్రియా !

Priya-Varrier
2019-03-12 04:00:40

ఒరు ఆదార్ లవ్ అనే మలయాళ సినిమా విడుదలకు ముందే హాట్ కేక్ అయిందంటే దానికి కారణం ప్రియా ప్రకాష్ వారియర్. ఈ త్రిసూర్ భామ కన్నుగీటిన వీడియోతో ఓవర్ నైట్ స్టార్ అవడమే కాక ఆ సినిమాకి కూడా పిచ్చ క్రేజ్ తెచ్చి పెట్టింది. అయితే అందరూ ఆ వీడియో వలన సినిమా ఆడుతుందని భావించగా అది బొక్కబోర్లా పడింది. చివరికి ఈ వీడియోనే సినిమా పోవడానికి కారణం అయిందని ఆ సినిమా డైరెక్టర్ సంచలన వ్యాఖ్యలు చేసి కలకలం రేపారు. మొదట అనుకున్న స్క్రిప్ట్ ప్రకారం ప్రియాది సపోర్టింగ్ క్యారక్టర్ మాత్రమేనని కన్నుగీటే వీడియోకు లభించిన పాప్యులారిటీని సొమ్ముచేసుకోవడానికి నిర్మాతలు అత్యుత్సాహం చూపించి స్క్రిప్టులో మార్పులు చేయించారని ప్రియా క్యారక్టర్ పెంచి అసలు హీరోయిన్ అయిన నూరిన్ షరీఫ్ క్యారక్టర్ తగ్గించారని అందుకే సినిమా డిజాస్టర్ అయిందని ఒమర్ లులూ విమర్శలు చేయడం కలకలం రేపింది. ఈయనే కాక ఇంతకు మునుపు హీరోయిన్ నూరిన్ షరీఫ్ కూడా ప్రియా కారణంగా తనకు రావాల్సిన పేరు రాకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేసింది. దాంతో తాజాగా ప్రియా వారియర్ తీవ్రస్థాయిలో స్పందించింది. తాను గనుక నోరు విప్పితే విమర్శలు చేసేవారి పరువు ఏమవుతుందో ఆలోచించుకోవాలని హెచ్చరించింది. అసలేం జరిగిందో బయటపెడితే ఎవరికీ పేరుప్రతిష్ఠలు మిగలవని ఆమె వార్నింగ్ ఇచ్చింది. తాను కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతానని, తనపై వస్తున్న విమర్శలన్నింటికీ కాలమే జవాబు చెబుతుందని పేర్కొంది. ఏంటో మరి ప్రియా దాచిపెట్టిన అంత రహస్యం.

More Related Stories