English   

అయ్యప్ప స్వామి మీద సినిమా...అనుష్క మెయిన్ లీడ్ గా !

Anushka
2019-03-12 05:10:02

భాగమతి సినిమా తర్వాత చాలా రోజుల గ్యాప్ తీసుకున్న అనుష్క ఇప్పటికే మాధవన్ హీరోగా కోనవెంకట్ నిర్మాణంలో హేమంత్ మధుకర్ అనే దర్శకుడు తెరకెక్కిస్తున్న సినిమా షూట్ లో జాయిన్ అవ్వాల్సి ఉంది. ఈ సినిమా షూటింగ్ ఎక్కువ భాగం అమెరికాలో జరగబోతోంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ మొదలు కానున్న ఈ సినిమాని ఎలా అయినా ఆగస్టులోపు సినిమా పూర్తిచేసి విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నాడు ఆ సినిమా సహనిర్మాత కోన వెంకట్. తాజాగా ఆమె మరో సినిమాకు ఓకే చెప్పిందని వార్తలు వస్తున్నాయి. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ సంతోష్ శివన్ దర్శకత్వంలో అనుష్క ఒక సినిమా చేయబోతుందని అయ్యప్ప స్వామి జీవితంపై ఈ చిత్రం రానుందని ఈసారి తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా తెరకెక్కబోతుందని వార్తలు వస్తున్నాయి. సంతోష్ శివన్ ఓవైపు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తూనే దర్శకత్వం వైపు కూడా అపుడప్పుడు ఆదులు వేస్తున్నారు. ప్రస్తుతం ఆయన మలయాళంలో ‘జాక్ అండ్ జిల్’ అనే సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అది పూర్తయిన వెంటనే అనుష్కతో సినిమాను పట్టాలెక్కిస్తారని అంటున్నారు. కానీ ఈ సినిమా అన్ని డివోషనల్ సినిమాలతో పోలిస్తే విభిన్నంగా ఉంటుందని అంటున్నారు నిర్మాతలు. మలయాళంలో  శ్రీ గోకులం గోపాలన్ అనే నిర్మాత చాలా సినిమాలు నిర్మించాడు. ముఖ్యంగా గా డివోషనల్ సినిమాలు నిర్మించడంలో ఈయన దిట్ట అని పేరుఈ అయ్యప్ప సినిమాకి ప్రశాంత్ అనే కొత్త కుర్రాడు కథ అందిస్తుండగా ఏ ఆర్ రెహమాన్ స్వరాలు అందిస్తుండటం విశేషం.  ఇంత వరకు బాగానే ఉన్నా అయ్యప్ప మీద సినిమా కాబట్టి ఇది వివాదాలకు దారి తీస్తుందేమో అనే అనుమానాలు కలుగుతున్నాయి. అయ్యప్ప ఆలయంలోకి మహిళ ప్రవేశం విషయం ఎంత వివాదాస్పదమైందో అందరికీ తెలిసిందే. అలాంటిది ఇప్పుడు అనుష్క ప్రధాన పాత్రగా అయ్యప్ప సినిమా వస్తుందంటే ఇదెన్ని వివాదాలకు దారి తీస్తుందో అని విశ్లేషకులు అనుమానిస్తున్నారు.

More Related Stories