English   

చిత్రలహరి టీజర్ వచ్చేస్తోంది !

Sai-Dharam-Tej
2019-03-12 12:20:52

దాదాపు అరడజను ఫ్లాప్స్ తర్వాత సాయిధరమ్ తేజ్ కథానాయకుడిగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో చిత్రలహరి అనే సినిమా రూపొందుతోన్న సంగతి తెలిసిందే. హలో ఫేం కల్యాణి ప్రియదర్శన్, నీది నాది ఓకే కధ ఫేం నివేద పేతురాజ్ కథానాయికలుగా నటిస్తోన్న ఈ సినిమాలో, సునీల్ వెన్నెలకిషోర్ ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు. కిషోర్ తిరుమల విభిన్నమైన టేకింగ్ తో ఈ సినిమా రూపొందుతోంది. నిజానికి ఈ సినిమా మీద ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారు. ఈ సినిమా విషయంలో మెగాస్టార్ కూడా ఇన్వాల్వ్ అయినట్టు వార్తలు వచ్చాయి. ఈ సినిమాని వేసవికి రిలీజ్ చేయనున్న నేపద్యంలో సినిమా ప్రమోషన్స్ మొదలెట్టింది యూనిట్. అందులో భాగంగానే ఈ సినిమా నుంచి టీజర్ ను వదలడానికి ముహూర్తాన్ని ఖాయం చేశారు. రేపు ఉదయం 9 గంటలకు టీజర్ ను వదలనున్నారని ప్రకటించింది యూనియ్. ప్రేమకథా చిత్రాలను యూత్ కి కనెక్ట్ అయ్యేలా ఆయన చాలా బాగా తెరెకెక్కిస్తారనే పేరు ఉంది ఈ సినిమా డైరెక్టర్ కి. గత సినిమాలతో దానిని నిరూపించాడు కూడా. మరి ఈ సినిమాతో ఆయన ఏమి మాయ చేయనున్నాడు అనేది ఆసక్తి కరంగా మారింది.  

More Related Stories