English   

భారతీయడు షూట్ ఆగిందా ?

Indian2
2019-03-12 05:35:39

కమల్‌ హాసన్‌ నటిస్తోన్న తాజా చిత్రం 'భారతీయుడు 2' ఈ సినిమాని డైరెక్టర్ శంకర్‌ తెరకెక్కిస్తున్నారు. ఈ ఏడాది జనవరిలో చిత్రీకరణ మొదలైన ఈ సినిమా ఆగిపోయిందనే వార్త కోలీవుడ్‌లో తెగ చక్కర్లు కొడుతోంది. 23 ఏళ్ల తర్వాత మరోసారి శంకర్, కమల్‌ హాసన్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో దీనిపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. 1996లో వచ్చిన ‘భారతీయుడు’ సినిమాకు ఇది సీక్వెల్‌గా వస్తోంది. అయితే ఇంత ప్రేస్టేజియస్ ప్రాజెక్ట్ ఎలా ఆగిపోయిందనే విషయమై కొన్ని రోజులుగా రకరకాల వ్యాఖ్యానాలు వినిపిస్తున్నాయి.  పెద్ద సినిమాలను ప్రొడ్యూస్ చేసే లైకా ప్రొడక్షన్స్ వారు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ మొదటి షెడ్యూల్ కు రెండున్నర కోట్లు బడ్జెట్ అంచనా వేసుకో గా షెడ్యూల్ పూర్తయ్యే సరికి 6 కోట్లు ఖర్చయిందట. పైగా అంత ఖర్చు పెట్టినప్పటికీ అనుకున్న సీన్లను చిత్రీకరించలేక పోయారట. కమల్ హాసన్ కి మేకప్ వేసేందుకు చాలా సమయం పడుతోందని దీంతో షూటింగ్ రోజూ ఆలస్యమవుతోందని ఈ నేపధ్యంలో, కమల్ హాసన్ తన రెమ్యునరేషన్ పెంచాలని డిమాండ్ చేస్తున్నారని  టాక్. అదీ కాక శంకర్ తో ఈ ప్రొడక్షన్ టీంకి సరిగా పొసగడం లేదని అందుకే షూట్ ఆపేశారని అంటున్నారు. శంకర్ అడిగినంత బడ్జెట్ లైకా సంస్థ కేటాయించలేకపోయిన క్రమంలో వారి మధ్య గొడవలు జరిగినట్టు చెబుతున్నారు. అయితే వీటి గురించి యూనిట్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. 

More Related Stories