English   

పోర్న్ స్టార్ పాత్రలో అన్ని టేక్ లు తీసుకుందంటే ఏ రేంజ్ లో ఉంటుందో ?

Ramya-Krishnan
2019-03-12 17:46:07

విజయ్ సేతుపతి, రమ్యకృష్ణ, సమంతా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా సూపర్ డీలక్స్. ఈ సినిమాలో రమ్యకృష్ణ పోషిస్తున్న పాత్ర హాట్ టాపిక్‌గా మారింది. ఎందుకంటే ఆమె ఈ సినిమాలో పోర్న్ స్టార్‌ గా నటిస్తోంది. త్యాగ రాజన్‌ కుమారరాజ దర్శకత్వంలో తమిళంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా ట్రైలర్ ఇటీవలే విడుదలైంది. ఇందులో రమ్యకృష్ణ పాత్రను చూసి అభిమానులు షాకయ్యారు. ఎందుకటే ఆమె శృంగార పోర్న్ స్టార్ గా నటిస్తుండం చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ సినిమాలో తన పాత్ర గురించి తాజాగా రమ్యకృష్ణ స్పందించారు. అలాంటి పాత్రలో ఎందుకు నటించాల్సి వచ్చిందో తన ఫ్యాన్స్ కి వివరణ ఇచ్చారు. ఇది తన కెరియర్లోనే ఛాలెంజింగ్ రోల్ అని కొన్ని పాత్రలు పేరు కోసం  కొన్ని పాత్రలు డబ్బుకోసం మరికొన్ని పాత్రలను ప్యాషన్ తో చేస్తామని అలా ప్యాషన్ తో చేసిన పాత్ర ఇది అని రమ్యకృష్ణ చెప్పుకొచ్చారు. సినిమాలో నటించిన ఓ సన్నివేశం గురించి రమ్యకృష్ణ ఆసక్తికర విశేషాలు చెప్పారు. ఓ సన్నివేశానికి ఏకంగా 37 టేక్‌లు తీసుకున్నట్లు ఆమె తెలిపారు. దాన్ని పూర్తి చేయడానికి రెండు రోజులు పట్టిందని అది చూసి తన అసిస్టెంట్లు, సెట్‌లో ఉన్నవారు షాకైనట్లు తెలిపారు. నటిగా అపారమైన అనుభవమున్న రమ్యకృష్ణ, ఈ సినిమాలో ఒక సీన్ కోసం 37 టేకులు తీసుకుందంటే సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అర్ధం చేసుకోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.

More Related Stories