English   

వర్మ సినిమాను ఆపాలని ఫిర్యాదు...ఆగదన్న వర్మ !

Lakshmis-NTR
2019-03-12 18:38:15

నందమూరి తారక రామారావు జీవితమలోకి లక్ష్మీ పార్వతి ఎంటర్ అయినప్పటి నుండి జరిగిన కథ ఆధారంగా సినిమా తీస్తున్నానని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రకటించగానే అందరి కళ్లు ఈ సినిమా మీద పడ్డాయి. వివాదాలకు కేరాఫ్ లాంటి వర్మ కచ్చితంగా దీన్ని కూడా వివాదం చేస్తారని అంతా భావించారు. అనుకున్నట్టుగానే లక్ష్మీపార్వతిని పాజిటివ్ యాంగిల్ లో చూపుతూ చంద్రబాబు నెగటివ్ గా చూపుతూ వెన్నపోటు అంటూ పాటలు కూడా ప్రచారంలోకి తెచ్చారు. ఈ వెన్నుపోటు అనే అంశం ఎన్నికల ముంగిట చంద్రబాబుకి ఇబ్బంది కరంగా మారే అవకాశం ఉన్న నేపధ్యంలో దిద్దుబాటు చర్యలు చేపట్టారు తెలుగుదేశం నేతలు. ఈ సినిమా విడుదలను అపాలంటూ టీడీపీ కార్యకర్త దేవిబాబు చౌదరి అనే వ్యక్తి కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత సినిమా విడుదల చేయడంలో ఉద్దేశం ఏంటని ఒక నేతను మంచిగా చూపించటానికి ప్రయత్నిస్తే ఫర్వాలేదని కానీ ఇక్కడ మరో నేతను విలన్ గా చూపించటం సరికాదని ఆయన పేర్కోన్నారు. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదలకు గతంలోనే రెండు మూడు తేదీలు ప్రకటించారనికానీ, ఎన్నికలకు ముందు కావాలనే విడుదల తేదీని నిర్ణయించారని అయన ఆరోపించారు. ఎన్నికల ముందు ఓటర్లపై ప్రభావం చూపించే అవకాశాలు ఎక్కువ ఉండటంతో పోలింగ్ లోపు లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలను నిలపివేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. సినిమా నిర్మాత రాకేష్ రెడ్డి వైసీపీ నేత అని కూడా పేర్కొన్నారు. అయితే దేవీబాబు ఫిర్యాదు అందుకున్న కేంద్ర ఎన్నికల సంఘం విషయాన్ని రాష్ట్ర సీఈవోను కలిసి ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ విషయం తెలుసుకున్న వర్మ సోషల్ మీడియా వేదికగా టీడీపీ పార్టీకి కౌంటర్ ఇచ్చారు. ఎలాంటి ఫోర్స్ తన సినిమాను థియేటర్ లోకి రాకుండా ఆపలేదని ట్వీట్ చేశాడు.

More Related Stories