English   

మహేష్ తో సుకుమార్ భేటీ...క్లాషెస్ క్లియర్ !

Mahesh Babu  and Sukumar personal meet
2019-03-12 20:12:12

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం 25 మహర్షి సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పూర్తయిన తర్వాత దర్శకుడు సుకుమార్ కాంబినేషన్లో లో సినిమా ఉంటుందని అందరూ భావించారు. అయితే అనూహ్యంగా సుకుమార్ సినిమా మా ఇల్లు అర్జున్తో ఉంటుందని ప్రకటించగానే టాలీవుడ్ మొత్తం ఉలిక్కి పడింది. ఇదే సమయంలో మహేష్ బాబు సుకుంర్ కి కంగ్రాట్స్ చెబుతూ ట్వీట్ చేయడం, తన వాన్ నేనొక్కడినే సినిమాని ప్రస్తావించడం వీరి మధ్య ఏదో జరిగిందనే ప్రచారం జోరుగా సాగింది. నిజానికి తన తదుపరి సినిమాను మహేశ్ బాబుతో చేయాలనే ఉద్దేశంతో సుకుమార్ కథా చర్చలు మొదలుపెట్టాడు. అయితే కథాపరంగా మహేశ్ బాబు చేసిన సూచనలు సుకుమార్ కి నచ్చలేదు. దాంతో ఆయన మనసు మార్చుకుని బన్నీతో అదే  ప్రాజెక్టును సెట్ చేసుకున్నాడు. తాను తీసుకున్న ఈ నిర్ణయం కారణంగా మహేశ్ బాబు హర్ట్ అయ్యాడని అందుకే అలా పోస్ట్ చేశాడని తెలిసి, ఆయనను స్వయంగా కలిసి కూల్ చేశాడు ఈరోజు. అయితే ఇప్పుడు మళ్ళీ మహేశ్ బాబుకి ముందుగా వినిపించిన కథనే బన్నీతో చేయనున్నాడా? లేదంటే బన్నీ కోసం కొత్త కథను సెట్ చేస్తున్నాడా? అనే అనుమానాలు మళ్ళీ మొదలయ్యాయి సినీ జనానికి. అయితే అందుతున్న సమాచారం ప్రకారం మహేశ్ బాబు కోసం అనుకున్న కథనే బన్నీతో సుకుమార్ చేయనున్నాడట. అయితే మహేశ్ కి అనుకున్న కధ ని బన్నీ బాడీ లాంగ్వేజ్ కి తగినట్టుగా చిన్న చిన్న మార్పులు చేస్తున్నారట. జూన్ నాటికి పూర్తి స్క్రిప్ట్ ను సిద్ధం చేసి, అక్టోబర్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టాలనే ఆలోచనలో వున్నట్టుగా చెప్పుకుంటున్నారు.

More Related Stories