English   

భారతీయుడు షూట్ ఆగడానికి కమల్ కారణం ?

no update on kamal hassan bharateeyudu 2 third schedule
2019-03-13 08:13:11

ఇండియన్ ఫేమస్ డైరెక్టర్ లలో ఒకరయిన శంకర్ దర్శకత్వంలో కమలహాసన్ కథానాయకుడిగా 'భారతీయుడు 2' సినిమా రూపొందుతోంది. వీరిద్దరి కాంబినేషన్ లో సుమారు ఇరవైఏళ్ల క్రితం వచ్చిన భారతీయుడు సినిమాకి సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ ప్రొడక్షన్ సంస్థ అయిన లైకా ప్రొడక్షన్స్ వారి నిర్మాణంలో రూపొందుతోన్న ఈ సినిమాలో కాజల్ కథానాయికగా నటిస్తోంది. ఈ ఏడాది జనవరి నెలలో మొదలయిన ఈ సినిమా ఇప్పటిదాకా రెండు షెడ్యూల్స్ ను పూర్తిచేసుకుంది. అయితే ఈ సినిమా గురించి కానీ మూడవ షెడ్యూల్ కి సంబంధించి కానీ ఎటువంటి అప్ డేట్స్ బయటికి రాకపోవడంతో, ఈ సినిమా షూటింగు ఆగిపోయిందనే ప్రచారం మొదలైంది ఒక రెండు మూడు రోజుల నుండి. మొదటి షెడ్యూల్ ని పరిమితికి మించి ఖర్చు పెట్టించాడని కానీ అవుట్ పుట్ సరిగా లేదని నిర్మాతలకి దర్శకుడికి మధ్య తలెత్తిన విభేదాలే షూట్ బ్రేక్ పడడానికి కారణమనే టాక్ వచ్చింది. కానీ అందుతున్న సమాచారం ప్రకారం అసలు కారణం అది కాదట. ఎన్నికలకి షెడ్యూల్ ప్రకటించిన నేపద్యంలో ప్రస్తుతం తన రాజకీయ పార్టీకి సంబంధించిన కార్యకలాపాల్లో కమల్ తీరికలేకుండా ఉన్నారట. ఈసారి లోక్ సభ ఎన్నికలలో సత్తా చాటాలని ఆయన భావిస్తున్నారు అందుకే ఈ ఎన్నికలు పూర్తయిన తరువాత షూటింగు పెట్టుకోవలసిందిగా ఆయన దర్శక నిర్మాతలని కోరడంతో ఎన్నికలు పూర్తయ్యాకే బెటర్ అని అప్పుడే 3వ షెడ్యూల్ ను ప్లాన్ చేసినట్టుగా సమాచారం. సో శంకర్ కి లైకా టీంకి పడట్లేదు అని వచ్చిన వార్తలు అన్నీ పుకార్లే అన్నమాట.

More Related Stories