English   

నిఖిల్ - నివేదల శ్వాస...తీసుకుంటారట !

Nikhil Siddhartha and Nivetha Thomas's new film is Swasa going to set from next month
2019-03-13 08:37:37

హ్యాపీ డేస్ సినిమాతో నటుడిగా పాపులర్ అయిన నిఖిల్, తనదైన శైలిలో సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. చేసేది చిన్న సినిమాలే అయినా తనదైన విభిన్న పాత్రలు ఎంచుకోవడంతో సక్సెస్ అవుతున్నాడు ఈ యువ నటుడు. తాజాగా ఆయన నటిస్తున్న సినిమా 'అర్జున్ సురవరం'. ఒక ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ గా నిఖిల్ నటించిన ఈ సినిమా ముందుగా ముద్ర పేరుతో రిలీజ్ కావాల్సి ఉండగా, టైటిల్ క్లాషేస్ వలన సినిమాలో నిఖిల్ పేరునే టైటిల్ గా మర్చారు. ఈ సినిమా ఈ 29వ తేదీన భారీస్థాయిలో విడుదల కానుంది. ఈ సినిమా మీద మంచి అంచనాలతో ఉంది సినిమా యూనిట్. ఆ సంగతి పక్కన పెడితే తాను నటించబోయే తర్వాతి సినిమాని కూడా లైన్ లో పెట్టేశాడు నిఖిల్. అర్జున్ సురవరం సినిమా థియేటర్లకు రాగానే, అలా ఆయన తదుపరి ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లనుందని అంటున్నారు. నిఖిల్ తదుపరి ప్రాజెక్ట్ గా శ్వాస అనే సినిమా రూపొందనుంది. నూతన దర్శకుడిగా కిషన్ కట్టా పరిచయమవుతోన్న ఈ సినిమాలో, కథానాయికగా నివేదా థామస్ ను తీసుకున్నారట. ఈ సినిమాలో నిఖిల్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా కనిపించనున్నాడని, ఇది పూర్తిగా ట్రావెల్ బేస్డ్ సినిమా అనొఇ అంటున్నారు. అందువలన ఇంతకుముందు తెరపై కనిపించని లొకేషన్స్ లో మాత్రమే ఈ సినిమా షూటింగు జరిగేలా ప్లాన్ చేస్తున్నట్టుగా ఇన్సైడ్ సమాచారం. రెడ్ స్కై ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై వచ్చే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టడానికి సన్నాహాలు చేస్తున్నారని అంటున్నారు.

More Related Stories