English   

రామ్ మరో సినిమా లైన్ లో పెట్టాడు...రీమేకట !

Ram Pothineni next is Thadam remake?
2019-03-13 08:56:09

గత కొంతకాలంగా ఎనర్జిటిక్ స్టార్ రామ్ కు సరయిన హిట్లు లేవు. అప్పుడెప్పుడో నేను శైలజతో హిట్ అందుకున్న రామ్ ఆ తర్వాత చేసిన ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ డిజాస్టర్ గా నిలుస్తోంది. అందుకే కథలపై మరింత శ్రద్ధ పెట్టి జాగ్రత్తగా కధలు ఎంచుకుంటున్నాడు. ప్రస్తుతం తనలానే వరుస ప్లాపులతో ఇబ్బంది పడుతున్న పూరితో ఇస్మార్ట్ శంకర్ సినిమా చేస్తున్నాడు. అయితే రామ్ తాజాగా ఒక తమిళ్ సినిమా మీద మనసు పడ్డట్లు చెబుతున్నారు. ఈ సినిమా తరువాత ఆయన ఈ తమిళ సినిమా రీమేక్ ని లైన్లో పెట్టేశాడట. ఆ తమిళ సినిమా ఏదో అనుకుంటున్నారా ? గతేడాది తమిళంలో రిలీజయి భారీ విజయాన్ని సాధించిన థడమ్ సినిమా రీమేక్ అట. ఈ సినిమాని మన రామ్ చరణ్ బ్రూస్ లీ సినిమాలో విలన్ గా నటించిన అరుణ్ విజయ్ హీరోగా నటించాడు. చాలా తక్కువ బడ్జెట్లో తమిళంలో అరుణ్ విజయ్ చేసిన ఈ సినిమా 15 కోట్ల వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ సినిమా తెలుగు రీమేక్ హక్కులను రామ్ పెదనాన్న స్రవంతి రవికిశోర్ దక్కించుకోగా, ఈ సినిమా నిర్మాణంలో ఠాగూర్ మధు కూడా ఒక భాగస్వామిగా ఉండనున్నారట. మరి ఈ రీమేక్ ను ఎవరు డైరెక్ట్ చేస్తారో..ఎప్పుడు మొదలుపెడతారు అనేది చూడాలి. ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

More Related Stories