English   

దెయ్యం సినిమాలో శ్రీ దేవి డాటర్ !

Janhvi Kapoor To Act In A Horror Comedy Film
2019-03-13 09:12:59

డాటర్ ఆఫ్ శ్రీదేవి అనే ట్యాగ్‌తో బాలీవుడ్‌లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన జాన్వీ క‌పూర్‌ తన తొలి చిత్రం ధ‌డ‌క్‌ తోనే ఇండస్ట్రీ చూపు తన వైపు తిప్పుకుంది. ఇక ఆమె ప్రస్తుతం కార్గిల్ గాళ్‌, త‌ఖ్త్‌ అనే సినిమాలతో బిజీగా ఉంది. అయితే బాలీవుడ్ మీడియా వర్గాల స‌మాచారం ప్రకారం శ్రీదేవి తనయ మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన చిత్రానికి సంత‌కం చేసింద‌ని తెలిసింది. గ‌త ఏడాది సంచ‌ల‌న విజ‌యం సాధించిన హార‌ర్ కామెడీ మూవీ స్త్రీ సినిమాలో హీరోగా న‌టించిన రాజ్ కుమార్ రావ్ రూహ్ అఫ్‌ జా అనే హార‌ర్ కామెడీ ఫిల్మ్‌ మొదలు పెడుతున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ పాత్ర చాలా కీలకమైందట. శోభనం నాడు కొత్త పెళ్ళి కొడుకుల‌ను త‌న పాట‌ల‌తో నిద్ర‌పుచ్చి పెళ్ళి కూతుళ్ళ‌ను ఆవ‌హించే ఓ దెయ్యం క‌థ‌గా రూహ్ అఫ్‌ జా స్టోరీ లైన్ ఉంది. ఉత్తర్‌ ప్రదేశ్‌లోని మొరాదాబాద్‌ నేపథ్యంలో ఈ స్టోరీ సాగుతుందట. ఈ సినిమా లైన్ విన్న జాన్వీ వెంటనే నటించేందుకు ఓకే చెప్పిందని అంటున్నారు. మ‌రి ఇప్పటిదాకా లవ్ స్టోరీ లకే పరిమితమయిన జాన్వి హార‌ర్ కామెడీ ఫిల్మ్‌లో ఏ మేరకు అల‌రిస్తుందో చూడాలి.
 

More Related Stories