English   

ఆర్ఆర్ఆర్ విషయంలో మళ్ళీ కన్ఫ్యూజ్ చేస్తున్న పరిణితి !

Parineeti Chopra reacts to rumours about being approached for SS Rajamouli’s  RRR Movie
2019-03-13 02:34:22

బాహుబలి డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో సినిమా అదీ కాక టాలీవుడ్ లో మరో ఇద్దరు టాప్ హీరోలు, భారీ బడ్జెట్ మూవీ. ఇక ఇప్పటి దాకా టైటిల్ సహా ఏమీ బయటకు రాకపోవడంతో ఈ సినిమా మీద రోజుకొక వార్త పుట్టుకు రావడం సహజంగా మారింది. ఇప్పటికే హీరోయిన్స్‌ కి సంబంధించి పలు గాసిప్స్ వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం ముందు నుండీ బాలీవుడ్ హీరోయిన్లు పరిణితి చోప్రా, అలియా భట్ పేర్లు వినిపించాయి. ఇప్పటికే హీరోయిన్స్ విషయంలో క్లారిటీ లేక బుర్రలు బద్దలు కొట్టుకుంటుంటే మరోసారి డైలమాలో పడేసింది పరిణితి చోప్రా. తాజాగా కేసరి ప్రమోషన్స్ లో భాగంగా ఆమె మీడియా సమావేశంలో పాల్గొనగా ఆమెను అక్కడ ఆర్‌.ఆర్‌.ఆర్‌ గురించి మీడియా వాళ్ళు ప్రశ్నించారు. అయితే పరిణితి మాత్రం ఆమె అటు తోసిపుచ్చానూ లేదు ఇటు క్లారిటీ ఇవ్వనూ లేదు. సరైన టైమ్ వచ్చినప్పుడు క్లారిటీ ఇస్తానని చెప్పి తప్పించుకుంది. పరిణితి మాట్లాడిన దాన్నిబట్టి చూస్తే పరిణితి కూడా ఒక హీరోయిన్ గా ఉండే అవకాశాలు ఎక్కువగానే ఉన్నట్టు కనిపిస్తోంది. రేపు రాజమౌళి ప్రెస్ మీట్ లో దీని గురించి కాస్త క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ సినిమాను డివివి ఎంటర్ టైన్మెంట్స్ పతాకం ఫై డివివి దానయ్య నిర్మిస్తుండగా కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

More Related Stories