English   

చిత్రలహరి టీజర్....కామెడీ మీల్స్ ఉన్నట్టే !

Chitralahari Movie  Teaser Out
2019-03-13 02:55:04

వరుస పరాజయాలతో ఢీలాపడ్డ మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ న‌టిస్తున్న తాజా చిత్రం చిత్ర‌ల‌హ‌రి. నేను శైల‌జ ఫేం కిశోర్ తిరుమ‌ల ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో ఇద్దరు భామలతో తేజూ రోమాన్స్ చేయనున్నాడు. ఈ సినిమాలో క‌థానాయిక‌లుగా క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్‌, నివేథ పెతురాజ్‌లు న‌టిస్తున్నారు. శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రం ఏప్రిల్ 12న‌ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. తాజాగా చిత్ర టీజ‌ర్ విడుద‌ల చేశారు. ఇందులో మొదటి పాత్ర ( నివేథ పెతురాజ్‌), రెండో పాత్ర ( క‌ళ్యాణి ప్రియ‌ద‌ర్శ‌న్‌), మూడో పాత్ర ( సునీల్‌), అసలు పాత్ర ( సాయిధ‌ర‌మ్ తేజ్‌) అంటూ పాత్ర‌ల‌ని ప‌రిచ‌యం చేశారు దర్శకుడు.

 

వీరు చెప్పే డైలాగ్స్ కూడా ఆక‌ట్టుకునేలా చెప్పించడంతో పాటు టీజ‌ర్‌ని బ‌ట్టి చూస్తుంటే మూవీ మంచి ఎంట‌ర్‌టైన‌ర్‌ గా ఉంటుంద‌ని అంచనా వేయచ్చు. ఒక్కొక్క పాత్ర యొక్క బిహేవియర్ ని ఈ టీజర్ ద్వారా పరిచయం చేసే ప్రయత్నం చేసింది యూనిట్. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతమందిస్తున్నారు. చాన్నాళ్ళ తర్వాత గ్యాప్ తీసుకుని అరవింద సమేత వీర రాఘవ సినిమాలో మెరిసిన సునీల్ ఈ చిత్రంలో మళ్ళీ క‌మెడీయ‌న్‌ గా అల‌రించ‌నున్నాడు. ఇక ఈ సినిమాలో తేజ్ లుక్ కూడా రామ్  చరణ్ రంగస్థలంలో లుక్ లా అనిపిస్తోంది గడ్డంతో. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒక లుక్ వేసెయ్యండి మరి.

More Related Stories