English   

వైసీపీలో చేరిన మరో సీనియర్ నటుడు !

Actor Raja Ravindra  Joins in YSRCP
2019-03-13 04:22:52

జగన్ పార్టీలో సినిమా వాళ్లు ఎక్కువై పోతున్నారు. ఓ వైపు పవన్కళ్యాణ్ పార్టీ పెట్టినా కూడా అక్కడికి ఎవరూ వెళ్లకుండా అందరూ జగన్ జగన్ అంటూ జగన్ నామస్మరణ చేస్తున్నారు. ప్రస్తుతం సినిమా వాళ్లు మొత్తం కట్ట కట్టుకొని వెళ్లి వైసీపీలో అడుగుపెడుతున్నారు. ఆ మధ్య నాగార్జున వచ్చి జగన్ ను కలవడం దగ్గర నుంచి అసలు రాజకీయాలు మొదలయ్యాయి. దానికి ముందు 30 ఇయర్స్ పృథ్వీ పోసాని కృష్ణమురళి ఇలాంటి వాళ్ళు జగన్ పార్టీలో ఉన్నారు. ఇక వినాయకుడు ఫేం కృష్ణుడు కూడా ఆ పార్టీ లో చేరారు. ఆ తర్వాత కమెడియన్ అలీ వచ్చి జగన్ పార్టీలో జాయిన్ అయిపోయాడు. ఆయన గుంటూరు నుంచి పోటీ చేస్తాడు అని అక్కడి నుంచి గెలిస్తే మంత్రి కూడా అవుతాడు అని వార్తలు వినిపిస్తున్నాయి. తనకు మంత్రి పదవి ఇస్తానంటేనే పార్టీలో చేరుతానని ముందు నుంచే కండిషన్ పెడితే దానికి ఒప్పుకొని పార్టీలో చేర్చుకున్నారు జగన్. ఇదిలా ఉంటే మొన్నటికి మొన్న జయసుధ కూడా వచ్చి జగన్ పార్టీలో అడుగుపెట్టింది. ఇక ఇప్పుడు మరొక నటుడు కూడా వైసీపీలో చేరబోతున్నాడు తెలుగు ఇండస్ట్రీ లో వందల సినిమాల్లో నటించిన సీనియర్ నటుడు రాజారవీంద్ర, ఇప్పుడు జగన్ పార్టీ కండువా కప్పుకున్నారు. తాజాగా ఆయన సమక్షంలో వైసీపీలో చేరాడు రాజా రవీంద్ర. ఎన్నికలు పూర్తయ్యే లోపు ఇంకా ఎంత మంది జగన్ పార్టీలో చేరుతారు అనేది ఆసక్తికరంగా మారింది.

More Related Stories