English   

ఇండస్ట్రీ వదిలేయాలని నిర్ణయం తీసుకున్న శివాజీరాజా !

Shivaji-raja
2019-03-13 14:24:55

మా అసోసియేషన్ ఎన్నికల తర్వాత శివాజీరాజా లో వైరాగ్యం పెరిగిపోయింది. ఆయన ఇండస్ట్రీలో ఉండకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈయన తీసుకున్న సంచలన నిర్ణయం పై అందరూ షాక్ అవుతున్నారు. ఇకపై సినిమాలకు పూర్తిగా దూరంగా ఉంటూ సినిమా ఇండస్ట్రీలో కూడా వదిలేసి ఆయన అరుణాచలం వెళ్ళిపోతున్నాడని ప్రచారం జరుగుతోంది. గతంలో ఒక సారి తన కుటుంబంతో సహా అరుణాచలం వెళ్లి అక్కడే సెటిల్ అయిపోతానని చెప్పాడు, కాకపోతే రెండోసారి అధ్యక్షుడిగా ఉండాలని కొందరు పోటీ చేయించారని కానీ ఇప్పుడు తనతో పాటు మా ప్రెసిడెంట్ పదవిని కూడా అవమానించారంటూ ఆయన బాధ పడుతున్నాడు. 

మా అసోసియేషన్ కోసం తాను ఎంత చేశాననేది తనకు మాత్రమే తెలుసని, ముఖ్య పదవుల్లో ఉన్నవాళ్ల అటెండెన్స్ కనీసం 20 శాతం కూడా ఉండదని కానీ తన అటెండెన్స్ మాత్రం 70 శాతం నుంచి తొంభై శాతం ఉంటుందని అంటున్నాడు శివాజీ రాజా. దీన్ని బట్టి తన నిబద్ధత ఏంటో అర్థం చేసుకోవాలని అంటున్నాడు. కానీ చివరి నిమిషంలో మా అధ్యక్ష పదవి కోసం తనను అవమానించారని అంటూ సన్నిహితుల దగ్గర వాపోతున్నారు ఈ సీనియర్ నటుడు. అందుకే ఇకపై ఇండస్ట్రీలో ఉండకూడదని పూర్తిగా వదిలేసి అరుణాచలం వెళ్లిపోవాలని శివాజీ రాజా నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఆయనను సముదాయించడానికి కొందరు ప్రయత్నిస్తునా ఆయన వారి మాట కూడా పెద్దగా వినడం లేదని ప్రచారం జరుగుతోంది. గతంలో నరేష్ కు తనకు ఓకే శాలువా కప్పేవారని అలాంటి సోదరుడు తనపై విమర్శలు చేస్తుంటే బాధ కలిగిందని అంటున్నాడు శివాజీ రాజా. మొత్తానికి మా ఎన్నికల తర్వాత ఏం ఒక సంచలన నిర్ణయం వైపు అడుగులు వేస్తున్నాడు మరి అది ఎక్కడికి దారి తీస్తుందో చూడాలి.

More Related Stories