English   

లక్ష్మీస్ ఎన్టీఆర్ మీద సంచలన కామెంట్స్ చేసిన లక్ష్మి పార్వతి !

Lakshmis-NTR
2019-03-13 08:21:55

లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా పై లక్ష్మీపార్వతి మరోసారి కామెంట్ చేసింది. ఈ సినిమాను ఎలాగైనా ఆపాలంటూ టిడిపి సభ్యులు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే దేవి చౌదరి అనే ఆయన లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదల ఆపాలని ఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదు చేశాడు. ఇందులో తమ నాయకుడు చంద్రబాబు నాయుడుని కావాలని నెగిటివ్ పాత్రలో రామ్ గోపాల్ వర్మ చూపించారని ఆయన తన ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీని పై రామ్ గోపాల్ వర్మ కూడా సెటైర్లు వేశాడు తన సినిమా ఎలా తీయాలో తెలుసని ఎవరో వచ్చి చెబితే తాను ఎందుకు వింటాను అంటున్నాడు వర్మ. 

ఇదిలా ఉంటే తాజాగా లక్ష్మీపార్వతి కూడా లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను ఆపాలని తెలుగుదేశం సభ్యులు చేస్తున్న ప్రయత్నం పై విరుచుకు పడింది. మీ నాయకుడు అంత మంచి వాడు అయితే ఎవరిని మోసం చేయకుండా పదవి దక్కించుకుంటే ఎవరికీ వెన్నుపోటు పొడవక పోతే ఎందుకు భయపడుతున్నారు ? నిజాలు ప్రేక్షకులు చూడనీయండి అంటూ ఆమె కామెంట్ చేసింది. ఒకవేళ నిజంగానే చంద్రబాబునాయుడు మంచివాడు అయితే లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాని అడ్డుకోవడానికి మీరు ఎందుకు ప్రయత్నిస్తున్నారు ? అంటూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని ఆమె ప్రశ్నిస్తోంది. దీంతో దీనికి ఎలాంటి సమాధానం చెప్పాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతున్నారు తమ్ముళ్ళు. 

బాబు చేసిన ద్రోహం అంత ఈజీగా ఎవ్వరూ మరిచిపోలేరని ఇప్పుడు సినిమాలో అసలు నిజాలు చూపిస్తే ఆయన బండారం బయటపడుతుందన్న భయంతో తెలుగుదేశం సభ్యులు లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారని లక్ష్మి పార్వతి వ్యాఖ్యానించింది. ఒక సినిమాను అడ్డుకునే హక్కు ఎవరికీ లేదని లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదలైన తర్వాత చంద్రబాబు నాయుడు అసలు బండారం బయటపడుతుంది అంటూ ఆమె సెటైర్లు వేస్తున్నారు.  మరి ఈ చిత్రం విడుదయ్యాక ఎలా ఎన్ని వివాదాలు సృస్టించబోతుందో చూడాలి. 

More Related Stories