English   

ఫిలిం స్టార్స్ మద్దతు కోరిన మోడీ !

PM-Modi
2019-03-13 11:56:00

సోషల్ మీడియాని గట్టిగా వాడడం పీఎం మోడీకి వెన్నతో పెట్టిన విద్య. ఆయన ప్రభుత్వం చేపట్టే పథకాలు ఆయన పర్యటనల వివరాలే కాక ప్రచారానికి కూడా మోదీ టీం ట్విట్టర్‌ ను గట్టిగానే వాడుతుంది. గతంలో స్వచ్ఛభారత్‌కు సోషల్ మీడియా ద్వారా ప్రచారం కల్పించడానికి ఇలానే సెలబ్రిటీలను ట్యాగ్స్ చేసి ఆ ప్రోగ్రాంని సక్సెస్ చేశారు. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఓటర్లను చైతన్యం చేసే పనిని పెట్టుకున్న మోడీ ఆ పనిలో కూడా సెలబ్రిటీలను వాడదామని డిసైడ్ అయ్యారు. అందుకే ఈరోజు సెలబ్రిటీలను ట్యాగ్ చేస్తూ మోదీ వరసపెట్టి ట్వీట్లు చేశారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చైతన్యం తీసుకురావాలని కోరారు. మోదీ రిక్వెస్ట్ చేసిన సెలబ్రిటీల్లో టాలీవుడ్ నుండి నాగార్జున కూడా ఉన్నారు. ఇక మళయాళ సీమ నుండి మోహన్ లాల్ ఉన్నారు. బాలీవుడ్ నుంచి రణ్‌వీర్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, వరుణ్ ధావన్, అక్షయ్ కుమార్, దీపికా పదుకొనె, అలియా భట్, అనుష్కలు ఉన్నారు. వీరందరినీ ట్యాగ్ చేసిన మోదీ ఒక ట్వీట్ చేశారు. మీరు ఎన్నో ఏళ్లుగా మీ నటనతో మిలియన్ల కొద్ది ప్రేక్షకులకు వినోదం పంచుతున్నారు. ఎన్నో అవార్డులు గెలుచుకున్నారు. భారీ స్థాయిలో ఓటర్లలో అవగాహన కల్పించాలని కోరుతున్నాను. ప్రతి ఒక్కరూ ఓటు వేసేలా చైతన్యం తీసుకురావాలని విజ్ఞప్తి చేస్తున్నాను’ అని మోదీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. 

More Related Stories