English   

కార్తీ - రష్మికాల సినిమా మొదలయ్యింది !

Karthi-Rashmika
2019-03-13 12:59:12

కన్నడ సినిమా కిరాక్ పార్టీ సినిమాతో హిట్ కొట్టి.. అక్కడి నుండి తెలుగులో మొదటి సినిమా ‘ఛలో, ఆ తర్వాత గీత గోవిందం లాంటి హిట్ సినిమాలతో మంచి క్రేజ్ తెచ్చుకుంది రష్మిక. ఒక పక్క తెలుగు సినిమాలు చేస్తూనే మరోపక్క తమిళ్ సినిమాలపై కూడా దృష్టి పెట్టింది ఈ అమ్మడు. ఇక అక్కడ కూడా స్టార్ హీరోలతో జోడి కట్టే ఛాన్స్ లు చేజిక్కించుకుంటుంది. స్టార్ హీరో సూర్య తమ్ముడు కార్తీ గతంలో లో ఖాకీ అనే పోలీస్ స్టోరీతో ఒక సినిమా తీసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన ఆ సినిమా నిర్మించిన డ్రీం వాలీ పిక్చర్స్ తోనే మరో సినిమా ప్రారంభించారు.  కార్తీ సరసన ఆయన కొత్త సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుందని కొద్దిరోజులుగా వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఆ ఆ వార్తలకు బలం చేకూరుస్తూ డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సినిమా మా ఓపెనింగ్ కార్యక్రమంలో రశ్మిక కూడా మెరిసింది. ఈ చిత్రం పూజా కార్యక్రమాలను జరుపుకుని నేడు లాంచనంగా ప్రారంభం అయ్యింది. కార్తీ 19 వ సినిమా గా రూపొందుతున్న ఈ సినిమాని ప్రస్తుతం సూర్య తో 'ఎన్ జీ కె', కార్తీ తో ఖైదీ నిర్మిస్తున్న ఎస్ ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు 'డ్రీమ్ వారియర్ పిక్చర్స్' బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాకి 'రెమో’ ఫేమ్ భాగ్యరాజ్ కన్నన్ దర్శకత్వం వహిస్తున్నారు. 

More Related Stories