English   

హీరోయిన్స్ మధ్య బాక్సాఫీస్ వార్ 

Samantha-Nayanthara
2019-03-14 01:54:25

బాక్సాఫీస్ దగ్గర ఇద్దరు స్టార్స్ పోటీ పడి నప్పుడు కచ్చితంగా డిస్ట్రిబ్యూటర్లు కంగారు పడతారు. అయితే ఇప్పుడు ఇద్దరు స్టార్ హీరోయిన్లు బాక్సాఫీస్ దగ్గర పోటీకి సిద్ధమవుతున్నారు. అది కూడా తెలుగు ఇండస్ట్రీ లో కాదు తమిళనాట సమంతా, నయనతార. ప్రస్తుతం వీరిద్దరూ బాక్సాఫీస్ వార్ కు సిద్ధమవుతున్నారు. ఇద్దరూ తమ తమ సినిమాలను మార్చి నెల చివర్లో విడుదల చేయబోతున్నారు. మార్చి 28న సమంత అక్కినేని నటిస్తున్న సూపర్ డీలక్స్ విడుదలవుతుంటే మార్చి 29న నయనతార నటిస్తున్న ఐరా సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ రెండు సినిమాలపై మంచి అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా తమిళనాట విజయ్ సేతుపతి కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ దృష్టిలో పెట్టుకుంటే సూపర్ డీలక్స్ సినిమాపై అంచనాలు భారీగా పెరిగి పోతున్నాయి. దానికి తోడు ఈ సినిమాలో అయన ట్రాన్స్ జెండర్ పాత్రలో నటించడం విశేషం. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ అద్భుతమైన రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇక ఇందులో సమంత పాత్ర కూడా చాలా కొత్తగా ఉందంటున్నారు దర్శక నిర్మాతలు. ఇదే సమయంలో నాయనతార ద్విపాత్రాభినయం చేసిన ఐరా సినిమాపై కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. ఎందుకంటే కొన్నేళ్లుగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ వస్తుంది నయనతార. వాటితోనే వరుస విజయాలు అందుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. తాజాగా ఇప్పుడు విడుదలకు సిద్ధమైన ఐర కూడా అలా చేసిందే. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఒక రోజు గ్యాప్ లో పోటీ పడుతుండటంతో అభిమానులు కూడా ఏమవుతుంది అని ఆసక్తిగా వేచి చూస్తున్నారు. తెలుగులో సమంతా, నయనతార ఇమేజ్ దృష్టిలో పెట్టుకొని ఇక్కడ కూడా ఈ రెండు సినిమాలు అనువదిస్తున్నారు దర్శక నిర్మాతలు. చూడాలి మరి ఏమవుతుందో ?

More Related Stories