English   

విజయ్ సినిమాకి టైటిల్ కష్టాలు !

Vijay-Deverakonda
2019-03-14 05:51:26

ప్రస్తుతం 'డియర్ కామ్రేడ్' చిత్రంలో నటిస్తున్న యంగ్ హీరో విజయ్ దేవరకొండ త్వరలో ట్రై లింగ్యువల్ సినిమాలో నటించనున్నాడని వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. నూతన దర్శకుడు ఆనంద్ అన్నామలై దర్శకత్వంలో రూపొందే ఈ చిత్రాన్ని తెలుగు తమిళ, కన్నడ మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని మైత్రీ మూవీస్ సంస్థ ఏకకాలంలో నిర్మించాలని ప్లాన్ చేసింది. ఏప్రిల్‌ 22న నయా ఢిల్లీలో ఈ సినిమా షూటింగ్‌ షురూ కానున్నట్లు మైత్రీ మూవీ మేకర్స్‌ ప్రకటించింది కూడా. ఈ సినిమాకి హీరో అనే టైటిల్ని ఖరారు చేశారట. అయితే ఇక అంతా శుభమే అనుకుంటున్న తరుణంలో ఈ సినిమాకి కొత్తగా టైటిల్ చిక్కులు వచ్చిపడ్డాయి. ఎందుకంటే తమిళంలో హీరో టైటిల్ తో హీరో శివకార్తికేయన్ కూడా ఓ సినిమా చేస్తున్నాడు. విజయ్ దేవర కొండ సినిమా కూడా తమిళంలో హీరో టైటిల్ తోనే విడుదల కాబోతుంది. ఇక రెండు సినిమాలకు ఒకే టైటిల్ పెట్టడంతో టైటిల్ వార్ మొదలయ్యింది. విజయ్ సినిమా పేరు ఒక బాషలో మారిస్తే మిగతా బాషలలో కూడా మార్చాలి అందుకే శివ కార్తికేయన్ టీంని మైత్రి వాళ్ళు సంప్రదిస్తున్నారట. టైటిల్ మార్చుకోమనే సూచనతో ! మరి ఏమవుతుందో చూడాలి. ఇక విజయ్ సినిమాలో విజయ్ రేసర్ గా కనిపిస్తాడట. స్పోర్ట్స్ డ్రామాగా రూపొందే ఈ సినిమా తొలి షెడ్యూలుని ఢిల్లీలో ప్లాన్ చేశారు.  

More Related Stories