English   

ఆర్ఆర్ఆర్ సినిమా కథ, పాత్రల మీద రాజమౌళి క్లారిటీ !

RRR
2019-03-14 07:57:38

బాహుబలి లాంటి భారీ బ్లాక్ బస్టర్ సిరీస్ తర్వాత దర్శక ధీరుడు - జక్కన్న రాజమౌళి ప్రారంభించిన ప్రాజెక్ట్ ఆర్ఆర్ఆర్. టాలీవుడ్‌ లో టాప్ హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ లు ఈ సినిమాలో హీరోలు కావడంతో ప్రస్తుతం అందరి దృష్టి ఈ సినిమా మీదే ఉంది. సినిమా మొదలుకాక ముందు ఈ సినిమా మీద వచ్చిన పుకార్లకు అంతే లేదు. ఇక మొదలయ్యాక కూడా అదే రేంజ్ లో రోజుకొక వార్త వస్తూనే ఉంది. ఈ సినిమా కథ, ఎన్టీఆర్ - రామ్ చరణ్ పాత్రలపైన, వీరికి జోడీగా నటించే హీరోయిన్స్‌పై చాలా పేర్లు రకరకాల రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. వీటికి చెక్ పెట్టేందుకు ఈరోజు ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. సినిమా కథతో పాటు పాత్రలు పాత్రధారులు, విడుదల తేదీతో సహా ఆయన  ప్రకటించారు. 

కథ :

కథ విషయానికి వస్తే అల్లూరి సీతా రామరాజు, కొమరం భీం పోరాట యోధులుగా మారటానికి ముందు కొంత కాలం అజ్ఞాతంలోకి వెళ్లారు. ఆ సమయంలో వారు ఎక్కడున్నారు ? ఇద్దరు వేర్వేరు ప్రాంతాలకి చెందిన వీరు కలిసి ఉంటె వీరిద్దరూ ఒకరినొకరు చూసి ప్రేరణ పొందితే ఎలా ఉంటుందనేది ఈ సినిమా కధ అని రాజమౌళి పేర్కొన్నారు. ఇదో ఫిక్షనల్ సినిమా అని పాన్ ఇండియా వైడ్ సినిమాని రిలీజ్ చేస్తున్నామని అన్నారు.

ఎవేరెవరు ఏయే పాత్రలు అంటే :

ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటిస్తుండగా ఆయన సరసన ఆలియా భట్ నటిస్తోంది. ఇక కొమరం భీం పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తుండగా ఆయనకి జోడిగా హాలీవుడ్ సుందరి డైసీ ఎడ్గర్‌ జోన్స్‌ నటిస్తోంది. వీరితో పాటు అజయ్‌దేవ్‌గణ్‌ కీలకపాత్రలో నటిస్తున్నా ఆయనది ప్రతినాయకుడి పాత్ర కాదని క్లారిటీ ఇచ్చారు. తమిళ నటుడు సముద్రఖని ఈ చిత్రంలో మరో కీలకపాత్రలో కనిపించబోతున్నట్టు ప్రకటించారు. అయితే వీరందరికీ తెలుగులో ఇదే మొదటి సినిమా కావడం విశేషం.

సినిమా రిలీజ్ :

ఈ సినిమాని 2020 జూలై 30న ఈ చిత్రాన్ని నాలుగు బాషలలో విడుదల చేస్తున్నట్టు తెలిపారు రాజమౌళి.  1920 లో జరిగే కథ కాబట్టి చాలా పరిశోధన చేశామని ఆనాటి జీవన విధానం, మనుషుల వ్యక్తిత్వం గురించి చాలా రీసెర్చ్ చేశామని అందుకే షూటింగ్ స్టార్ట్ చేయడం లేట్ అయిందని రాజమౌళి పేర్కొన్నారు.

More Related Stories