English   

కండలు పెంచోస్తోన్న రామ్...ఇస్మార్ట్ కోసమా డబుల్ ఇస్మార్ట్ కోసమా ?

ismart-shankar
2019-03-14 16:07:40

దేవదాస్ సినిమాతో ఇండస్ట్రీలో అడుగుపెట్టి మొదటి సినిమాతోనే హిట్ కొట్టి యువతుల మనసులు కొలగోట్టిన యువ హీరో రామ్ పోతినేనికి ఈ మ‌ధ్య కాలంలో స‌రైన హిట్ లేదు. చాన్నాళ్ళు గ్యాప్ తీసుకున్నన ఆయన తనలాగే హిట్ లేక బాధ పడుతున్న డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో ఇస్మార్ట్ శంక‌ర్ అనే సినిమా ఒప్పుకుని మొదలుపెట్టాడు. ఈ సినిమా ఇప్పటికే ఒకటి రెండు షెడ్యూళ్ళు పూర్తి చేసుకుని గోవా షెడ్యూల్ కూడా మొదలెట్టేసారు. తనకు చాలా కాలంగా లక్ కలిసి రాకపోవడంతో ఈ సినిమా ఖచ్చితంగా లక్ ఇస్తుందని ఆయన నమ్ముతున్నాడు. ఈ సినిమాలో తన లుక్ ని పూర్తిగా మార్చేసిన రామ్ ఇప్పుడు ఈ సినిమా కోసం రామ్ భారీ కండ‌లు పెంచే పనిలో పడ్డాడు. జిమ్‌ లో ఆయన క‌స‌ర‌త్తులు చేస్తు కష్ట పడుతున్న ఫోటోల‌ని త‌న ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేస్తూ 2.0 లోడింగ్ అంటూ క్యాప్షన్ పెట్టాడు. అయితే ఈ సినిమాకి సీకేవ్ల్ టైటిల్ కూడా ఫిక్స్ చేయడం తో ఈ కండలు పెంచేది ఇస్మార్ట్ కోసమా లేక డబుల్ ఇస్మార్ట్ కోసమా అనే అనుమానాలు మొదలయ్యాయి. ప్ర‌స్తుతం ఇస్మార్ట్ శంక‌ర్ మూవీ చిత్రీక‌ర‌ణ గోవాలో జ‌రుగుతోన్న‌ట్టు తెలుస్తుంది. మాస్‌ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా పూరీ స్టయిల్ లో తెరకెక్కతున్న ఈ సినిమాకు మొదటి సారిగా దేవీ కాకుండా మణిశర్మ సంగీతమందిస్తున్నారు. రామ్‌ స‌ర‌స‌న‌ నిధి అగర్వాల్‌, నభా నటేష్‌లు హీరోయిన్లుగా నటిస్తున్నారు.  

More Related Stories