English   

సమ్మర్ లో సినీ వార్...వరుస సినిమాలు ?

tollywood
2019-03-14 09:58:05

ఏప్రిల్ మొత్తం వరుసగా చిన్న సినిమాలు పెద్ద సినిమాలతో బాక్సాఫీస్ సందడి సందడిగా మారబోతుంది. ఓవైపు ఎలక్షన్లు, మరోపక్క ఐపిఎల్ సీజన్ ఉన్నాకూడా మరోవైపు మన దర్శక నిర్మాతలు వరుసగా సినిమాలు తీసుకొస్తున్నారు. మార్చి 22 నుంచి ఈ కొత్త సినిమా సీజన్ కు తెర లేవనుంది. ఈ వారం ఎనిమిది సినిమాలు వస్తున్నా కూడా వాటి మీద పెద్దగా అంచనాలు లేవు. అయితే మార్చి 22న లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా రావడం, అక్కడి నుంచి వరుసగా పెద్ద సినిమాలు క్యూకట్టడం అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి. మార్చి 22న రామ్ గోపాల్ వర్మ  తెరకెక్కించిన లక్ష్మీస్ ఎన్టీఆర్ తో ఈ బాక్సాఫీస్ యుద్ధం మొదలు కానుంది. ఆ తర్వాత ఏప్రిల్ 5న నాగచైతన్య సమంత పెళ్లి తర్వాత తొలిసారి నటించిన మజిలీ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఏప్రిల్ 12న సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న చిత్రలహరి విడుదల కానుంది. తాజాగా విడుదలైన ఈ చిత్ర టీజర్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. ఇక ఏప్రిల్ 19న నాని నటిస్తున్న జెర్సీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఏప్రిల్ 25న తేజ బెల్లంకొండ శ్రీనివాస్ కాంబినేషన్లో వస్తున్న సీతా సినిమా విడుదల కానుంది. ఇలా ఏప్రిల్ లో వరుసగా ప్రతి వారం సినిమాలు విడుదల అవుతున్నాయి. ఇదే సమయంలో ఎలక్షన్స్ కూడా ఉండటంతో ఏం జరుగుతుంది అనే ఆసక్తి ప్రేక్షకుల్లో కనిపిస్తుంది. ఇక దర్శక నిర్మాతలు కూడా టెన్షన్ పడుతూనే ఉన్నా సమ్మర్ హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ధైర్యంగా కనిపిస్తున్నారు. మే 9న మహర్షి సినిమా విడుదల కావడంతో ఈ భారీ సినిమా సీజన్కు తెర పడనుంది.

More Related Stories