English   

చిత్రలహరి మీదే ఆరుగురి ఆశలు...ఏమయ్యేనో ?

Chitralahari
2019-03-14 18:59:59

ఒక్క సినిమా ఇప్పుడు అరడజను మంది కెరీర్స్ కు కీలకంగా మారింది. ఒక సినిమాతో ఒకరు హిట్ కొట్టాల్సి వస్తుంది లేదంటే ఇద్దరు హిట్ కొట్టాల్సి వస్తుంది, కానీ ఇప్పుడు చిత్రలహరి సినిమా విషయంలో మాత్రం సినిమాకు పనిచేస్తున్న వారంతా హిట్ కొట్టాల్సిన పరిస్థితుల్లో పడిపోయారు. ముందుగా హీరో సాయి ధరమ్ తేజ్ కు వరుసగా ఆరు ఫ్లాపులు ఉన్నాయి. ఈయన 2015 లో వచ్చిన సుప్రీం సినిమా తర్వాత ఇప్పటి వరకు మరో హిట్ కొట్టలేకపోయింది. హీరోయిన్లు కళ్యాణి ప్రియదర్శన్, నివేదా పేతురాజ్ కూడా హిట్ కోసం వేచి చూస్తున్నారు. హలో సినిమా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన కళ్యాణి తొలి విజయం కోసం వేచి చూస్తోంది. ఇదే సమయంలో మెంటల్ మదిలో సినిమాతో ఆకట్టుకున్న నివేదపేతురాజ్ తొలి హిట్ కొట్టాలని వెయిట్ చేస్తోంది. ఇక చిత్రలహరి సినిమాలో ఓ కీలక పాత్రలో నటించిన సునీల్ రి ఎంట్రీలో సత్తా చూపించాలని తహతహలాడుతున్నాడు. ఇంకా ఈ చిత్ర దర్శకుడు కిషోర్ తిరుమల కూడా ఉన్నది ఒకటే జిందగీ సినిమాతో అనుకోని ఫ్లాప్ ఇచ్చాడు. దాంతో ఈయనకు కూడా చిత్రలహరి సినిమా ఇప్పుడు కీలకంగా మారింది. వీళ్లందరికీ తోడు మైత్రి మూవీ మేకర్స్ కూడా వరుసగా ఫ్లాపులు బాట పట్టేసింది. 3 బ్లాక్ బస్టర్ లతో ఇండస్ట్రీకి వచ్చిన ఈ సంస్థకు సవ్యసాచి, అమర్ అక్బర్ ఆంటోనీ రూపంలో రెండు డిజాస్టర్స్ వచ్చాయి. దాంతో ఇప్పుడు మైత్రి మూవీ మేకర్స్ కూడా ఫామ్ లోకి రావాలని చూస్తోంది. అందుకే ఇప్పుడు ఒకే ఒక్క సినిమా ఇంతమంది ఆశలను మోసుకొస్తోంది. ఏప్రిల్ 12న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు రానుంది మరి ఇంత మంది కెరీర్స్ చిత్రలహరి ఏం చేయబోతుందో చూడాలి.

More Related Stories