English   

దోచేస్తున్నారని బుక్ మై షో, పీవీఆర్ ల మీద కేసు !

Case against BookMyShow and PVR for charging customers extra internet handling fees
2019-03-14 20:20:03

ఒకప్పుడు సినిమా రిలీజ్ అయిందంటే హాలు దగ్గర టికెట్ కౌంటర్ లలో ఆ క్యూలలో నిలబడి టికెట్టు సంపాదిస్తే అదొక ఘన కార్యంలా ఫీలయ్యే వాళ్ళం. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఇంట్లోనో, ఆఫీసులోని ఆరుబయటో కూర్చుని మన మొబైల్ లోనో, కంప్యూటర్ లోనో బుక్ చేసేస్తున్నాం. అలా దాదాపు మనందరం టికెట్లు ఏదో ఒక సమయంలో బుక్ చేసే ఉంటాం. అయితే అప్పుడు అక్కడ టికెట్ హ్యండిలింగ్ ఫీజు అని ఒకటి ఉంటుంది. దానికి మనం కొంత డబ్బు కడుతూ ఉంటాం. అయితే మనం కట్టే టికెట్ డబ్బుకు ఈ డబ్బు ఎందుకు అదనంగా కడుతున్నాం అనే డౌట్ వచ్చిన ఒక వ్యక్తి ఆర్బేఐని ఆర్తీఐ ద్వారా ప్రశ్నిస్తే ఆయా కంపెనీలకి అలా డబ్బు వసూలు చేసే అధికారం లేదని సమాధానం వచ్చింది. నిజానికి ఈ పేమెంట్ ని సదరు సంస్థలే బ్యాంకులకు చెల్లించాలి. కానీ వారు మన చేత కట్టిస్తున్నారు. ఉదాహరణకి బుక్ మై షో లాంటి పోర్టళ్లు చూసినట్టయితే Rs 138 ఉండాల్సిన టికెట్  Rs 157.82 అవుతుంది అంటే వారు  Rs 19.82 ఇంటర్నెట్ చార్జీల కింద మన చేత కటించుకుంటున్నారు అందులో Rs 16.80 ఇంటర్నెట్ చార్జీ అయితే Rs 3.02 ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ ఉంటుంది. ఈ విషయం మీద కోర్టుకు వెళ్ళింది, ఫారం ఫర్ కరేప్షణ్ అనే సంస్థ, తన ప్రతివాదులుగా బుక్ మై షో , పీవీఆర్ అలాగే ప్రభుత్వ ఐటీ శాఖను చేర్చింది. ఈ కేసు మర్చి 23న విచారణకు రానుంది. అయితే యాప్ తయారీదారులు మాత్రం పనితీరు మెరుగు పరుచుకోవడం కోసం ఇది మామూలే అని చెబుతున్నారు. అయితే ఈ విషయం మీద ఇంకా ఆయా సంస్థలు స్పందించలేదు.

More Related Stories