English   

ప్రభాస్, చరణ్, మహేష్ లని వెనక్కునెట్టిన విజయ్ !

Vijay-Deverakonda
2019-03-15 03:51:42

విజ‌య్ దేవ‌ర‌కొండ‌ అనే వ్యక్తి పెళ్లి చూపులు సినిమా ముందు వరకూ పెద్దగా పరిచయం లేదు. ఎప్పుడైతే ఆ సినిమా రిలీజ్ అయ్యిందో ఆయన జనాలకు కాస్త నోటేడ్ అయ్యాడు. ఏదేమైనా ఆయన నటించిన అర్జున్ రెడ్డి సినిమా రిలేజ్ కావడంతో ఆయన స్టార్ హీరోలలో ఒకడుగా మారిపోయాడు. అయన ఏ సినిమా చేసినా దాని మీద క్రేజ్ రావడం చిన్న సినిమా పెద్ద సినిమా తేడాలేకుండా జనాలు ఆదరించడం మొదలెట్టారు. ఇప్ప‌టికే ఎన్నో సంచ‌ల‌నాలు సృష్టించిన విజయ్ ఇప్పుడు మరో ఘనత సాదించాడు. తాజాగా ఆయన మోస్ట్ డిజైర‌బుల్ మెన్ ఆఫ్ 2018గా ఎంపిక‌య్యాడు. హైదరాబాద్‌ టైమ్స్ నిర్వహించిన సర్వేలో టాలీవుడ్ టాప్‌ హీరోలు ప్రభాస్‌, మహేష్‌ బాబు, రామ్‌ చరణ్, ఎన్టీఆర్‌ లాంటి వాళ్లను వెనక్కి నెట్టి విజయ్‌ మొదటి స్థానం దక్కించుకున్నాడు. ఒక నయా హీరో హీరోలంద‌ర్నీ వెన‌క్కి నెట్టి ఈ రికార్డు సాదించడం సంచలనంగా మారింది. గతేడాది మూడో స్థానంలో ఉన్న ఈయన ఈ సారి తొలి స్థానంలో ఎగబాకాడు. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే చెన్నై డిజైర‌బుల్ మెన్ లిస్టులో కూడా ఈ ఏడాది మూడో స్థానంలో ఉన్నాడు విజ‌య్. తెలుగు, త‌మిళ‌ రాష్ట్రాల్లో ఇలా ఓకే ఏడాది చోటు సంపాదించుకున్న ఒకే ఒక్క హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ.  ప్రస్తుతం డియర్‌ కామ్రేడ్ సినిమాలో, క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో రెండు సినిమాలు చేస్తున్నారు. తాజాగా ఆయన తమిళ దర్శకుడు ఆనంద్‌ అన్నామలై దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్‌ స్పోర్ట్స్ డ్రామాలో నటించేందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చాడు.

More Related Stories