English   

మహేష్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ !

Mahesh
2019-03-15 04:30:19

సూపర్ స్టార్‌ మహేష్ బాబుకున్న క్రేజ్ గురించి సెపరేట్‌గా చెప్పాల్సిన పనిలేదు. అతని పాపులారిటీని గుర్తించిన  ప్రపంచ ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం వాళ్లు అతని మైనపు విగ్రహాన్ని తయారు చేసే పనిలో పడ్డారు.మేడం టుస్సాడ్స్ సింగపూర్ ఆధ్వరంలో ప్రపంచంలోనే తన మొట్టమొదటి మైనపు బొమ్మని మార్చ్ 25 న హైదరాబాద్ లోని తన సినిమా హాల్ లో ఆవిష్కరించనున్నారు మహేష్. నిజానికి మేడం టుస్సాడ్స్ సింగపూర్ వారు ఇలా ఒక సెలెబ్రిటీ ప్రతిమని సింగపూర్ లో కాకుండా బయట ఆవిష్కరించడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా అభిమానులు తమ అభిమాన హీరోని పోలివుండే ప్రతిమతో సెల్ఫీలు, ఫోటోలు పంచుకునే అవకాశం లభిస్తోంది. అయితే ఈ సందర్భంగా మరో కాంటెస్ట్ ప్రకటించారు. అదేంటంటే మహేష్ బాబు ని పోలి ఉండేలా బొమ్మలు గీసి మేడం టుస్సాడ్ సింగపూర్ సోషల్ మీడియా పేజెస్ లో పెట్టి ఆకట్టుకున్న వారిలో ఇద్దరు లక్కీ విన్నర్స్ కి మహేష్ తో కలిసి ఫోటో దిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఆ తర్వాత మహేష్ మైనపు ప్రతిమ మేడం టుస్సాడ్స్ సింగపూర్ లో అంగరంగ వైభవంగా జరిగే ఐఫా ఉత్సవాల్లో భాగం కానుంది.
ఈ కాంటెస్ట్ కి సంబందించిన పూర్తి వివరాల కోసం ; 
https://cms.madametussauds.com/singapore/en/making-of-mahesh-babu-giveaway-contest/ చుడండి

 

More Related Stories