English   

సైనా బయోపిక్ నుండి శ్రద్దా అవుట్...రీజన్ అదేనట !

Parineeti
2019-03-15 14:00:32

అంత‌ర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ జీవితం ఆధారంగా ఒక బయోపిక్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అమోల్ గుప్తే తెర‌కెక్కిస్తున్న ఈ సినిమా గత ఏడాది సెప్టెంబర్ లో ఘనంగా ప్రారంభోత్సవం జరుపుకుంది. ఇక ఈ సినిమాలో సైనా రోల్ కి శ్రద్దా కపూర్ ని అనుకున్నారు. ఆమెతో ఒక షెడ్యూల్ కూడా ప్రారంబించారు. అయితే అనుకోకుండా ఆమె అనారోగ్యం పాలవ్వడం ఆ తర్వాత అది డెంగ్యూ అని తేలడంతో ఆమె ఈ సినిమా షూట్ నుండి తప్పుకుంది. ఈ ఏడాది ఏప్రిల్ నుండి ఆమె షూట్ లో పాల్గొంటుంది అని భావిస్తున్న తరుణంలో ఆమె స్థానే పరిణితి చోప్రాని తీసుకుంటున్నట్టు ప్రకటించింది సినిమా యూనిట్. ఎందుకంటే శ్రద్దా ప్రస్తుతం ఒక పక్క సాహో, మరోపక్క స్ట్రీట్ డాన్సర్ ఇంకో పక్క భాగీ 3 సినిమాల్లో నటించాల్సి ఉండడం, ఆమె బిజీ షెడ్యూల్ కారణంగా ఆమెను తప్పించినట్టు చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే శ్ర‌ద్ధా క‌పూర్ స్థానంలో ప‌రిణితీ చోప్రాని ఎంపిక చేసి షూటింగ్‌ని త్వ‌ర‌గ‌తిన పూర్తి చేయ‌నున్నార‌ట‌.  

More Related Stories