English   

ఎన్టీఆర్, చరణ్ అభిమానులకి షాక్ ఇచ్చిన రాజమౌళి !

Rajamouli
2019-03-15 18:54:32

బాహుబలి సిరీస్ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయిన రాజమౌళి తలపెట్టిన యజ్ఞం ఆర్ఆర్ఆర్, ఇద్దరు టాప్ హీరోలు, ఒక బాలీవుడ్ టాప్ హీరో, ఒక బాలీవుడ్ టాప్ హీరోయిన్, ఒక హాలీవుడ్ నటి, ఒక కోలీవుడ్ స్టార్ యాక్టర్ కం డైరెక్టర్ ఇలా అంత స్టార్ క్యాస్టింగ్ తో ఈ ప్రాజెక్ట్ చేపట్టాడు. తాజాగా ఈ విషయం మీద నిన్న ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిన జక్కన్న చాలా విషయాలు క్లారిటీ ఇచ్చాడు. అయితే ఒక విషయంలో మాత్రం రామ్ చరణ్, ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు రాజమౌళి షాక్ ఇచ్చాడు. ఎందుకంటే ఎన్టీఆర్ అరవింద సమేత వీరరాఘవ గత ఏడాది అక్టోబర్ నెలలో రిలీజయ్యింది. ఇక చరణ్ వినయ విదేయ రామ ఈ సంక్రాంతికి రిలీజయ్యింది. ఆనాటి నుండి వీరిద్దరి లీకేజ్ పిక్స్ గానీ, ఏదైనా ఫంక్షన్లో పిక్స్ గానీ చూసి సరిపెట్టుకుంటున్నారు. ఈ నెలలో చెర్రీ పుట్టిన రోజు, వచ్చే మే నెలలో ఎన్టీఆర్ పుట్టినరోజులు ఉండడంతో అప్పుడు యూనిట్ నుండి ఫస్ట్ లుక్స్ వస్తాయని కళ్ళల్లో కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు అభిమానులు. ఇప్పుడు అదే విషయంలో ఈ ఏడాదిలో కాదు కదా మరో ఏడాది వరకు ఎటువంటి ఫస్ట్ లుక్ లేదని తేల్చేసాడు. దీంతో అభిమానులు అయితే తెగ బాధపడిపోతున్నారు. 

More Related Stories