English   

మహర్షి షూట్ లో వ్యక్తి మృతి !

Maharshi
2019-03-16 11:04:20

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న సినిమా మహర్షి. ఇప్పటికే రెండు సార్లు రిలీజ్ డేట్ మార్చుకున్న ఈ సినిమా మరో మారు వివాదంలో చిక్కుకుంది. ప్రస్తుతం టాకీ భాగం పూర్తి చేసుకున్న ఈ సినిమా రెండు సెట్ సాంగ్స్ బాకీ ఉన్నాయి. అయితే మహర్షి షూటింగ్ సెట్ కోసం లైట్స్ ఏర్పాటు చేస్తున్న సమయంలో లొకేషన్ లో ఒక వ్యక్తి చనిపోయిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. మహర్షి సాంగ్స్ షూట్ కోసం సెట్ వేసే పనిలో ఉండగా కృష్ణా నగర్ కి చెందిన కృష్ణారావు అనే ఓ లైట్ మెన్ కి విద్యుత్ షాక్ తగలడంతో వెంటనే స్పృహ కోల్పోయాడు. అలా షాక్ కి గురైన కృష్ణరావుని స్థానిక ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతి చెందినట్లు డాక్టర్లు ద్రువీకరించడంతో ఆయనతోటి వర్కర్స్ పనులు ఆపేసి నష్టపరిహారం కోసం డిమాండ్ చేశారని సమాచారం. దీని మీద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం. ఆయన చాలా సినిమాలకి లైట్ మ్యాన్ గా వ్యవహరించారని చెబుతున్నారు. అయితే ఆయన కుటుంబ సభ్యుల వివరాలు తెలియరాలేదు. అయితే ఈ సినిమాని ముగ్గురు ప్రొడ్యూసర్స్ నిర్మిస్తున్న సందర్భంగా వారు ఆ వ్యక్తికి ఏమైనా నష్టపరిహారం ఇస్తారేమో వేచి చూడాలి. 
 

More Related Stories