English   

పీఎం బయోపిక్ రిలీజ్ డేట్ వచ్చింది....రిలీజ్ అవుతుందా ?

Modi-biopic
2019-03-16 04:10:20

ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ జీవిత క‌థాంశం ఆధారంగా రూపొందించిన పీఎం న‌రేంద్ర మోదీ బయోపిక్ సినిమాకి ముహూర్తం కుదిరింది. సరిగ్గా ఎన్నికలు మొదలయిన రెండవ రేజు అంటే ఏప్రిల్ 12వ తేదీన సినిమా రిలీజ్ చేయ‌నున్నారు. మేరీ కొమ్ ఫేం ఒమంగ్ కుమార్ ఈ సినిమాను డైర‌క్ట్ చేశాడు. ఈ ఏడాది జ‌న‌వ‌రిలోనే మొదలయిన ఈ సినిమా షూటింగ్ ప్ర‌స్తుతం ముంబైలో చివ‌రి పూర్తి కావొస్తోంది. మోదీ బాల్యం, ఆ త‌ర్వాత ఆయన రాజ‌కీయ ప్ర‌వేశం గురించి సినిమాలో ఎక్కువ హైలైట్ చేయనున్నారు. గుజ‌రాత్ సీఎం అయింది మొదలు ఆయన 2014లో లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో సృష్టించిన ప్ర‌భంజ‌నాన్ని మోడీ వేవ్ ని కూడా ఫిల్మ్‌లో కాస్త సినిమాటిక్ టచ్ ఇచ్చి జనాల్లోకి వదలనున్నారు. ఈ సినిమా పోస్ట‌ర్‌ ను అయితే మొత్తం 27 భాష‌ల్లో రిలీజ్ చేశారు. అయితే సినిమా అన్ని బాషలలో రిలీజ్ చేస్తారా ? లేక కేవలం బాలీవుడ్ వరకే రిలీజ్ చేస్తారో ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ఈసారి ఎన్నికలు ఏడూ దశల్లో జరగున్న నేపధ్యంలో ఈ సినిమా మీద ఎవరైనా కేసు వేస్తే పరిస్థితి ఏమిటి అనేది తేలాల్సి ఉంది. ఎందుకంటే మోడీని హైలైట్ చేసే సినిమా కాబట్టి కాంగ్రెస్ కానీ ఇతర విపక్ష నేతలు కానీ సినిమా రిలీజ్ మీద కేసులు వేసే అవకాశం ఉంది.

More Related Stories