English   

సంగీత రీ ఎంట్రీ !

Actress-Sangeetha
2019-03-16 11:32:52

తెలుగు, తమిళ భాషల్లో హీరోయిన్ గా సంగీత కొంత కాలం ఇండస్ట్రీని ఏలింది. ఖడ్గం, పెళ్ళాం ఊరెళితే, సంక్రాంతి లాంటి తెలుగు సినిమాలో ఆమె గుర్తింపు పొందింది. తమిళ భాషలో కూడా సంగీత ఒ మాదిరి సినిమాల్లో నటించింది. అయితే ప్రేమ వివాహం చేసుకున్న ఈమె పెళ్లి తర్వాతా పూర్తిగా సినిమాలు మానేసింది. అయితే అందుతున్న సమాచారం ప్రకారం ఆమె తమిళ సినిమాతో మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తోంది. విజయ్ అంటోనీ నటిస్తున్న తమిళ రాసన్ అనే సినిమాతో సంగీత రీ ఎంట్రీ ఖాయం అయ్యిందని సమాచారం. బాబు యోగేశ్వరన్ అనే దర్శకుడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రమ్య నంబిసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాలో సంగీత ఒక కీలక పాత్రను చేస్తోన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఎస్‌ఎన్‌ఎస్‌ మూవీస్‌ బ్యానరుపై కౌసల్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంతో ఎడిటర్‌ మోహన్‌ మనవడు, దర్శకుడు మోహన్‌రాజా కుమారుడు మాస్టర్‌ ప్రణవ్‌ కూడా సినీ పరిశ్రమకు పరిచయం కానున్నారు.  

More Related Stories