English   

పెళ్ల్లి మీద స్వాతి నాయుడు భర్త షాకింగ్ కామెంట్స్ !

Swathi-Naidu
2019-03-16 11:37:23

యూట్యూబ్ స్టార్ స్వాతి నాయుడుని పెళ్లి చేసుకొని ఒక్కసారిగా హాట్ టాపిక్ అయిపోయాడు అవినాష్ నాయుడు అనే కుర్రాడు. తాజాగా విజయవాడలో వీళ్ళ పెళ్లి జరిగింది. అసలు స్వాతి నాయుడుని పెళ్లి చేసుకోవడం అంటే చిన్న విషయం కాదు. ఆమెను పెళ్లి చేసుకున్న తర్వాత తను ఓ రేంజ్లో ఆడుకుంటారు అని తనకు ముందే తెలుసు అంటున్నాడు అవినాష్. అన్ని తెలిసి సమాజం ఏమనుకున్నా పర్వాలేదు అనుకున్న తర్వాతే స్వాతి నాయుడుని పెళ్లి చేసుకున్నట్లు ఆయన చెప్పాడు. ఆమె అంటే తనకు చాలా ఇష్టమని తనకు కూడా అదే ఫీలింగ్ ఉందని తెలుసుకున్న తర్వాత ఇద్దరం పెళ్లి చేసుకుందాం అనుకున్నామని అంటున్నాడు అవినాష్. ఈ పెళ్లి పై తన ఇంట్లో అస్సలు ఒప్పుకోలేదని యూట్యూబ్ లో స్వాతి నాయుడు శృంగార వీడియోలు చూసిన తర్వాత ఇంట్లో వాళ్ళు అసలు తనతో మాట్లాడటం మానేసినట్లు చెప్పాడు అవినాష్. ఇక పెళ్లి జరగకుండా ఆపడానికి తన తమ్ముడు కూడా ఊహించని విధంగా షాక్ ఇచ్చాడు అంటున్నాడు అవినాష్. అయితే ఏం జరిగినా కూడా తాను స్వాతి నాయుడుని పెళ్లి చేసుకోవాలని ముందే గట్టిగా ఫిక్స్ అయిపోయినట్లు చెబుతున్నాడు అవినాష్. ఆమె మనసు చాలా సున్నితంగా ఉంటుందని కెమెరా ముందు నటించడం తెలుసు కానీ బయట నటించడం అస్సలు తెలియదని అంటున్నాడు అవినాష్. ఆమె మంచితనం అర్థం చేసుకొని ఇద్దరం ఒకరిని ఒకరు పూర్తిగా తెలుసుకున్న తర్వాత పెళ్లి చేసుకున్నామని చెబుతున్నాడు. తన ఇంట్లో వాళ్ళు స్వాతి నాయుడుతో తనను విడగొట్టడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా తాను మాత్రం ఆమెకు దూరంగా ఉండలేనని ఆమె లేకుండా బతకలేనని చెబుతున్నాడు మొత్తానికి వీరిద్దరి ప్రేమ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది. దానికి తోడు పెళ్లి తర్వాత కూడా స్వాతి నాయుడు నటించవచ్చు అని చెప్పి మరో షాక్ ఇచ్చాడు స్వాతి నాయుడు భర్త.

More Related Stories