English   

కుర్ర హీరోను ఫాలో అవుతున్న రాజమౌళి ! 

Rajamouli
2019-03-16 04:54:52

దర్శకుడు అనిల్ రావిపూడిని రాజమౌళి ఫాలో అవుతున్నాడు ! నమ్మడానికి ఇది కాస్త కష్టంగా అనిపించినా కూడా ఇదే నిజం. అనిల్  బ్లాక్ బస్టర్ అందుకున్న రూట్ లోనే ఇప్పుడు దర్శకధీరుడు కూడా ఫాలో అయిపోతున్నాడు. ఇంతకీ ఏ విషయంలో ఈ కుర్ర దర్శకుడిని ఫాలో అవుతూ జక్కన్న అంతగా ఇష్టపడి మరీ అడుగులు వేస్తున్నాడు అనుకుంటున్నారా ? తాజాగా తెరకెక్కిస్తున్న ట్రిపుల్ ఆర్ సినిమా విషయంలోనే అనిల్ రావిపూడి నే ఫాలో అవుతున్నాడు రాజమౌళి. ఈ సినిమాలో రామ్ చరణ్ ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తున్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దానికి తోడు ఎన్ని రోజులు ఎన్నో అనుమానాలు ఈ సినిమాపై ఉండేవి, ఒక్క ప్రెస్ మీట్ పెట్టి ఈ సినిమాపై ఉన్న అనుమానాలను ఒకేసారి తెర దించేశాడు రాజమౌళి. 

ఇక ఈ సినిమాలో తన హీరోలు అల్లూరి సీతారామరాజు, కొమరంభీం పాత్రలో నటిస్తున్నారని చెప్పి మరో షాక్ ఇచ్చాడు. వాళ్ళు హీరోలుగా మారకముందు ప్రపంచానికి తెలియక ముందు ఎలా ఉండేవారు ? అసలు వాళ్ల ప్రయాణం ఎలా మొదలై ఇలా మారిపోయారు ? అనేది ఈ సినిమాలో తాను చూపించబోతున్నట్లు చెప్పాడు రాజమౌళి. అందరికి తెలిసిన అల్లూరి, కొమరం భీమ్ లు కాకుండా వాళ్ళ జీవితాల్లో ఎవరికీ తెలియని ఒక కోణాన్ని ఊహాజనితంగా తెరకెక్కిస్తున్నట్లు చెప్పాడు దర్శకధీరుడు. కచ్చితంగా ఈ సినిమాతో ఈయన మరోసారి సంచలనం సృష్టించడం ఖాయం అనే విషయం అర్థమైపోతుంది. 

ఇక తెలియకుండానే అనిల్ రావిపూడి వెళ్లిన దారిలోనే ఇప్పుడు రాజమౌళి కూడా వెళుతున్నాడు. దానికి కారణం ఆంధ్ర తెలంగాణ స్లాంగ్. ఇక్కడ కొమరంభీం, అల్లూరి సీతారామరాజు పాత్రలు తెలంగాణ ఆంధ్ర కు సంబంధించినవి ఈ రెండు పాత్రలకు రెండు భిన్నమైన భాషలు ఉంటాయి. ఈ మధ్యే విడుదలైన f2 సినిమాలో హీరోలు ఇద్దరు రెండు రాష్ట్రాలకు చెందినవారు వెంకటేష్ ఆంధ్రా నుంచి వస్తే వరుణ్ తేజ్ తెలంగాణ నుంచి వచ్చాడు. ఇద్దరి కలయిక బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పుడు రాజమౌళి కూడా తెలంగాణ, ఆంధ్రను కలుపుతూ ఒక సినిమా చేస్తున్నాడు. ఈ విషయంలో తనకు తెలియకుండానే అనిల్ రావిపూడిని ఫాలో అయిపోతున్నారు రాజమౌళి.

More Related Stories