English   

మరో హీరోయిన్ చెల్లెలు రెడీ అయిపోతోంది !

Taapsee
2019-03-16 15:07:25

తెలుగు ఇండస్ట్రీ లోనే కాదు అటు ఇండస్ట్రీలోనూ అక్కచెల్లెళ్లు హీరోయిన్లుగా రావడం కామన్. అందులో ఎవరో ఒక్కరు మాత్రమే సక్సెస్ అవుతుంటారు. ఇప్పుడు తాప్సి కూడా తన చెల్లెలిని ప్రపంచానికి పరిచయం చేసే పనిలో పడింది. అయితే ఈ ముద్దుగుమ్మ మాత్రం ఇప్పటి వరకు మీడియా ముందుకు రాలేదు. తాప్సీకి ఒక అందమైన చెల్లెలు ఉంది ఆమె పేరు షాగున్. తనకు జీవితంలో ఆమె కంటే విలువైనది ఏదీ లేదని తన చెల్లికి ఏదైనా చిన్న చెడు జరిగినా కూడా తనకు ప్రాణం పోయినంత పని జరుగుతుంది అని చెబుతోంది తాప్సీ. తాజాగా ఆమెను గట్టిగా ముద్దులు పెడుతూ హగ్ చేసుకున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. తనకు చెల్లి అంటే ప్రాణం అని ఆమె తన జీవితం అంటోంది ఈ ముద్దుగుమ్మ. ఆమె కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటాను అంటోంది తాప్సీ. తెలుగులో  ఉన్నప్పుడు తాప్సీకి పెద్దగా విజయాలు రాలేదు, చేసిన ప్రతి సినిమా పరాజయం తప్ప మరోటి లేదు. కానీ హిందీ కి వెళ్ళిన తర్వాత ఈమె అదృష్టం మారిపోయింది. అక్కడ గ్లామర్ పాత్రల కంటే కూడా ఎక్కువగా నటనకు ఆస్కారమున్న పాత్రలలో నటించింది తాప్సి. ఈ మధ్యకాలంలో అమితాబ్ బచ్చన్ హీరోగా వచ్చిన బద్లా కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లు సాధిస్తుంది. ఈ ఆనందంలోనే తన చెల్లితో తనకున్న అనుబంధాన్ని ప్రేక్షకులతో పంచుకుంది ఈ ముద్దుగుమ్మ. మళ్లీ తెలుగులో ఎప్పుడు నటిస్తారు అంటే మాత్రం సమాధానం చెప్పట్లేదు తాప్సీ.

More Related Stories